AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Customers Alert: ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు షాక్‌.. ఇక నుంచి ఆ లావాదేవీలపై ప్రాసెసింగ్‌ ఫీజు, పన్ను వసూలు..!

SBI Customers Alert: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన కస్టమర్లకు షాకిచ్చింది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వాడే వారికి ఈ షాకింగ్‌ న్యూస్‌..

SBI Customers Alert: ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు షాక్‌.. ఇక నుంచి ఆ లావాదేవీలపై ప్రాసెసింగ్‌ ఫీజు, పన్ను వసూలు..!
Subhash Goud
|

Updated on: Nov 13, 2021 | 5:16 PM

Share

SBI Customers Alert: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన కస్టమర్లకు షాకిచ్చింది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వాడే వారికి ఈ షాకింగ్‌ న్యూస్‌. క్రెడిట్‌ కార్డు ఈఎంఐ లావాదేవీలపై ఇక నుంచి రూ.99 ప్రాసెసింగ్‌ ఫీజును వసూలు చేయనున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. అంతేకాదు ప్రాసెసింగ్‌ ఫీజుతో పాటు పన్ను కూడా వసూలు చేయనున్నట్లు వెల్లడించింది. 2021, డిసెంబర్‌ 1వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ఈ-కామర్స్‌ సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, రిటైల్‌ షాపుల ద్వారా కొనుగోలు చేసిన వస్తువులపై ఈఎంఐలపై రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు సంస్థ ఎస్‌బీఐ మెయిల్‌ పంపింది. మర్చంట్‌ ఔట్‌లెట్‌, వెబ్‌సైట్‌, యాప్‌లలో చేసే అన్ని రకాల ఈఎంఐ లావాదేవీలపై డిసెంబర్‌ 1 నుంచి రూ.99 ప్రాసెసింగ్‌ ఫీజు, పన్నులు వసూలు వర్తిస్తాయని తెలిపింది. ఎస్‌బీఐ కొత్త నిబంధనల కారణంగా కోట్లాది మంది వినియోగదారులపై అదనపు భారం పడనుంది.

అయితే సాధారణంగా క్రెడిట్‌ కార్డులపై ఈఎంఐ లావాదేవీలపై బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తూ వ్యాపారస్థులే కస్టమర్లకు రాయితీలు ఇస్తున్నారు. ఏదైనా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు నో కాస్ట్‌ ఈఎంఐ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇలాంటి లావాదేవీలపైన డిసెంబర్‌1 నుంచి ప్రాసెసింగ్‌ ఫీజుతో పాటు ట్యాక్స్‌ వసూలు చేయనుంది. ఈఎంఐలుగా మార్చుకున్న లావాదేవీల పైనే రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత లావాదేవీ విఫలమైతే ఫీజు తిరిగి ఇచ్చేస్తారు.

ఇంకో విషయం ఏంటంటే ముందుగానే ఉపయోగించిన లావాదేవీ ఈఎంఐలపై డిసెంబర్‌ తర్వాత ప్రారంభం అవుతుంటే దానిపై ప్రాసెసింగ్ ఫీజు అంటూ ఏమీ ఉండదు. కానీ రివార్డు పాయింట్లు మాత్రం ఇవ్వరు. అయితే వసూలు చేస్తున్న ప్రాసెసింగ్‌ ఫీజు ఈఎంఐలలోనే కలిసే ఉంటుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

Kids PAN Card: మీ పిల్లల పేరుపై పాన్‌ కార్డు కావాలా..? 18 ఏళ్ల లోపు ఉన్న వారు కూడా పాన్‌ పొందవచ్చు.. ఎలాగంటే..

Fixed Deposit: సీనియర్‌ సిటిజన్లకు గుడ్‌న్యూస్‌.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ అందిస్తున్న బ్యాంకులు ఇవే..!

Follow Us
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!