Telangana BJP: తెలంగాణలో బీజేపీ కొత్త చర్చ.. కొత్త ఫ్రెండ్షిప్ కోసం అధ్యక్షుడి తహతహ.. ఇందులో ఇంత వ్యూహముందా..!

|

Nov 13, 2021 | 12:30 PM

BJP-Bandi Sanjay Kumar: ఆయన ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు.. రాజకీయంగా మాంచి ఊపు మీద ఉన్న నేత.. రెండు ఏళ్లుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు..

Telangana BJP: తెలంగాణలో బీజేపీ కొత్త చర్చ.. కొత్త ఫ్రెండ్షిప్ కోసం అధ్యక్షుడి తహతహ.. ఇందులో ఇంత వ్యూహముందా..!
Follow us on

BJP-Bandi Sanjay Kumar: ఆయన ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు.. రాజకీయంగా మాంచి ఊపు మీద ఉన్న నేత.. రెండు ఏళ్లుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు అయనను తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మీద ప్రముఖంగా నిలబెట్టింది. కానీ ఎదో మిస్ అవుతుందనేది స్పష్టంగా తెలుస్తోంది. అందుకే ఆ మిస్సింగ్ ను పూడ్చడానికి ఆయన కొత్త ఫ్రెండ్‌షిప్ మొదలు పెట్టారు. ఇంతకు తెలంగాణ బీజేపీలో నడుస్తున్న కొత్త దోస్తీ చర్చ ఏంటి? అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బండి సంజయ్.. గత రెండు ఏళ్లగా తెలంగాణ రాజకీయాల్లో తరచుగా వినిపిస్తున్న పేరు. కేసీఆర్ బంధువు, ఉద్యమకారుడు అయిన బోయినపల్లి వినోద్ కుమార్ ను కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ఓడగొట్టి తెలంగాణకు సుపరిచితంగా పరిచయమయ్యారు బండి సంజయ్. ఆ కొద్దికాలానికే అనూహ్యాంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవ్వడం.. ఆ తర్వాత వచ్చిన దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించడం ఆయనను మరింత పాపులర్ పర్సనాలిటీగా చేసింది. అయితే ఎన్నికలు వచ్చినప్పుడేనా అనే చర్చ కూడా ఉంది. మిగితా సమయాల్లో బండి వేసే అడుగుల్లో తప్పుడు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో టాక్. మరి ఆ తప్పులను సరిదిద్దే సీనియర్స్ ఎవరూ ఆయన వైపు లేరనే చర్చ నడుస్తోంది.

ఈ నేపథ్యంలోనే.. ఆ టాక్‌కు పుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు బండి సంజయ్. అందులో భాగంగానే దానిని సరి చేసుకునేందుకు బండి సంజయ్ ఇప్పుడు ఒక కొత్త స్నేహం వైపు అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండి, ఆయన కదలికలు, వ్యూహాలను అంచనా వేసే ఈటల రాజేందర్ తో స్నేహం చేయడానికి సంజయ్ ఆసక్తి చుపిస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. ఈటల సూచనలతో ముందుకు పోవాలనే భావనలో ఆయన ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అసెంబ్లీలో కూడా ఈటలను ఫ్లోర్ లీడర్ చేయాలనీ బీజేపీ భావిస్తుందట. తద్వారా ఆయన సేవలను ఎక్కువగా వినియోగించుకోవాలని కూడా సంజయ్ భావిస్తున్నారట.

జాతీయ కార్యదర్శి పదవితో పాటు ఫ్లోర్ లీడర్ ఉంటే బీజేపీ ప్రోటోకాల్ ప్రకారం ఈటల రాజేందర్ అన్ని సమావేశాల్లో ఉండే పరిస్థితి ఉంటుందని, అందుకే ఫ్లోర్ లీడర్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈటల ప్రతీ ఈవెంట్‌లో ఉంటే.. సంజయ్‌కు ప్లస్ పాయింట్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. ఇక ఈటల రాజేందర్ కూడా బండి సంజయ్ కు ఎప్పటికప్పుడు సరైన సూచనలు, సలహాలు ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు.

Also read:

Vaccine Booster Dose: చాలా దేశాల్లో కరోనా బూస్టర్ డోస్ టీకా ఇస్తున్నారు.. మరి మన దేశంలో కూడా మూడోసారి వ్యాక్సిన్ తీసుకోవాలా?

Samantha: ఇతరులు చేసిన పని నువ్వు కూడా చేయాలని లేదు.. సమంత చేసిన పోస్ట్‏కు అర్థమేంటో ?

Hyderabad Police: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కాడు.. పేరు తప్పు చెప్పి.. మళ్లీ అడ్డంగా బుక్కయ్యాడు..