TS Graduation Elections: టీఆర్ఎస్‌కు పవన్ కళ్యాణ్ మద్ధతు.. తీవ్రంగా స్పందించిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్..

|

Mar 14, 2021 | 6:05 PM

TS Graduation Elections 2021: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. జనసేనతో పొత్తుపై..

TS Graduation Elections: టీఆర్ఎస్‌కు పవన్ కళ్యాణ్ మద్ధతు.. తీవ్రంగా స్పందించిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్..
Bandi Sanjay Kumar
Follow us on

TS Graduation Elections 2021: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. జనసేనతో పొత్తుపై తాము ఇప్పటి వరకు మాట్లాడలేదన్నారు. బీజేపీ అన్యాయం చేస్తే తనతో మాట్లాడి ఉంటే బాగుండేదని సంజయ్ అన్నారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై జనసేన నాయకులతో చర్చిద్దామని కూడా చెప్పానని బండి సంజయ్ పేర్కొన్నారు. మొన్నటి వరకూ టీఆర్ఎస్‌ను వ్యతిరేకించిన పవన్.. ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థికే మద్ధతు ఇవ్వడంపై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తీరు ప్రజలను అయోమయానికి గురిచేస్తోందన్నారు. పవన్ కళ్యాన్ తీరు సరిగా లేదని విమర్శించారు. ప్రజలు వ్యతిరేకించిన పార్టీకి పవన్ మద్ధతిచ్చారని అన్నారు.

ఇదిలాఉంటే.. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో తమ పట్ల తెలంగాణ బీజేపీ సరిగా వ్యవహరించలేదని జనసేన అధినే పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పార్టీని తెలంగాణ బీజేపీ నేతలు పదే పదే వాడుకుని వదిలేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకే మద్ధతు ప్రకటించామని గుర్తు చేసిన పవన్.. గ్రాడ్యూయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమను కనీసం పట్టించుకోలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే ఆ పార్టీతో కష్టమే అన్న పవన్ కళ్యాణ్.. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దివంగత నాయకుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె, టీఆర్ఎస్ అభ్యర్థి వాణి దేవికి మద్ధతు ప్రకటించారు. వాణి దేవిని గెలిపించాల్సిందిగా ఓటర్లకు పవన్ పిలుపునిచ్చారు.

Also read: పుదుచ్చేరి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో రభస, గందరగోళం, కలబడిన నేతలు, అదనపుఁ బలగాల మొహారింపు

AP Municipal Results: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఫలితాల్లో వైసీపీ జోరు.. మైదుకూరు, తాడిపత్రిలో టీడీపీ హవా

Patalakka Shyama : పాటలక్క శ్యామాగా డీ గ్లామర్ రోల్ లో చేస్తున్న కన్నడ నటి.. రియల్ గా ఎంత అందగత్తో తెలుసా..!