Telangana: పార్టీ అధిష్ఠానానికి అన్ని విషయాలు వివరించాం.. ఈటల, రాజ్‌గోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

|

Jun 25, 2023 | 4:36 AM

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసేందుకు పార్టీ సీనియర్ నేతలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేంధర్‌లు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నడ్డాతో వీళ్ల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో దాదాపు మూడున్నర గంటల వరకు తెలంగాణ జరుగుతున్న ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేంధర్, కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Telangana: పార్టీ అధిష్ఠానానికి అన్ని విషయాలు వివరించాం.. ఈటల, రాజ్‌గోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Eetala Rajendhar And Raj Gopal Reddy
Follow us on

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను  కలిసేందుకు పార్టీ సీనియర్ నేతలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేంధర్‌లు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నడ్డాతో వీళ్ల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో దాదాపు మూడున్నర గంటల వరకు తెలంగాణ జరుగుతున్న ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేంధర్, కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షని మేరకే ఢిల్లీ వచ్చామని.. పార్టీ బలోపేతం గురించి చర్చలు జరిపామని ఎమ్మెల్యే ఈటల రాజేంధర్ తెలిపారు. పార్టీని బలోపేతం చేసే క్రమంలో మా మద్ధతు, సహకారం ఉండాలని జేపీ నడ్డా కోరినట్లు తెలిపారు. అలాగే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించామని తెలిపారు. సీఎం కేసీఆర్ కుటుంబ పాలన, దోపిడి నేపథ్యంలో ఎలా ముందుకు సాగాలనే విషయాలపై చర్చించినట్లు తెలుస్తోందని చెప్పారు.

కర్ణాటల ఎన్నికల ఫలితాల అనంతరం వేరే విధంగా మాట్లాడుకున్నప్పటికీ.. ప్రజలకు ప్రధాని మోదిపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. తాము చెప్పినట్లుగా ముందుకెళ్తే కేసీఆర్ సర్కార్‌ను ప్రజలు గద్దె దించుతారని పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం తెలంగాణ రాజకీయాలపై పట్టుదలతో ఉన్నారని.. రాష్ట్రంలో ఎలా ఉండాలనే విషయంపై కూడా ఆయన భరోసా ఇచ్చారని తెలిపారు. కుటుంబ పాలనను అంతం చేయడంపై ప్రధానంగా చర్చలు జరిపామని.. ఈ క్రమంలో వారికి పలు సూచనలు కూడా చేసినట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..