AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: హైదరాబాద్‌లో మరోసారి రెచ్చిపోయిన వీధి కుక్కలు..

హైదరాబాద్‌లో వీధికుక్కల బెడద ఇంకా తగ్గలేదు. బయటికి వెళ్తామంటే ఇప్పటికీ కుక్కలు హడలెత్తిస్తూనే ఉన్నాయి. ఎవరైనా కనిపిస్తే చాలు.. పిక్కలు పీకేస్తున్నాయి వీధి కుక్కలు. ఎక్కడికెళ్లినా, ఏ విధిలో చూసినా గుంపులుగుంపులుగా సంచరిస్తూ వణుకుపుట్టిస్తున్నాయి. దీంతో స్థానికులు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.

Telangana: హైదరాబాద్‌లో మరోసారి రెచ్చిపోయిన వీధి కుక్కలు..
Stray Dogs
Aravind B
|

Updated on: Jun 25, 2023 | 4:16 AM

Share

హైదరాబాద్‌లో వీధికుక్కల బెడద ఇంకా తగ్గలేదు. బయటికి వెళ్తామంటే ఇప్పటికీ కుక్కలు హడలెత్తిస్తూనే ఉన్నాయి. ఎవరైనా కనిపిస్తే చాలు.. పిక్కలు పీకేస్తున్నాయి వీధి కుక్కలు. ఎక్కడికెళ్లినా, ఏ విధిలో చూసినా గుంపులుగుంపులుగా సంచరిస్తూ వణుకుపుట్టిస్తున్నాయి. దీంతో స్థానికులు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. తాజాగా.. హైదరాబాద్‌లో వీధికుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. నేరేడ్‌మెట్ పరిధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో వీధి కుక్కలు ఇద్దరు వ్యక్తులపై దాడి చేశాయి. స్థానిక కాకతీయనగర్‌లో ఒక వృద్ధురాలిని వీధి కుక్క కరవడంతో అతని కాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అలాగే.. నేరేడ్‌మెట్‌ పరిధిలోనే.. వెస్ట్ శ్రీకృష్ణనగనర్‌లో ఒక చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధికుక్కలు దాడి చేయబోయాయి. అయితే.. చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసేందుకు ప్రయత్నించగా తల్లిదండ్రులు అప్రమత్తం కావడంతో ఆ చిన్నారికి ప్రాణాపాయం తప్పింది.

ప్రస్తుతం దీనికి సంబంధించి దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. ఒక్కసారిగా రెండు మూడు వీధికుక్కలు చిన్నారిపైకి ఎగబడబోయాయి. తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తం అయినట్లు సీసీ ఫుటేజ్‌లో కనిపిస్తోంది. అయితే పాపకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఆమె తల్లితండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. మొత్తంగా.. వీధి కుక్కల బెడదతో హైదరాబాద్‌ ప్రజలు ఇంకా భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కడ నుంచి ఏ కుక్క వచ్చి దాడి చేస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లపై తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా వీధి కుక్కల బీభత్సంపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నగర ప్రజలు. ఇప్పటికైనా.. జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి అప్రమత్తం కావాలని.. వీధి కుక్కలను కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి
Follow Us
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!