CM KCR: దళితుల అభివృద్ధికి ప్రభుత్వ చర్యలు భేష్.. సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించిన మోత్కుపల్లి నర్సింహులు..

CM KCR: మరియమ్మ లాకప్ డెత్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు..

CM KCR: దళితుల అభివృద్ధికి ప్రభుత్వ చర్యలు భేష్.. సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించిన మోత్కుపల్లి నర్సింహులు..
Mothkupalli Narsimhulu
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 27, 2021 | 7:54 PM

CM KCR: మరియమ్మ లాకప్ డెత్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసలు కురిపించారు. ‘మరియమ్మ లాకప్ డెత్ విషయంలో మీరు తీసుకున్న రక్షణ చర్యలు దళితుల్లో మీ మీద విశ్వాసం పెరిగింది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మోత్కుపల్లి నర్సింహులు అభినందించారు. సీఎం ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప‌థ‌కం విధివిధానాల రూప‌క‌ల్పన‌పై సీఎం కేసీఆర్ అధ్యక్షత‌న ప్రగ‌తి భ‌వ‌న్‌లో ఆదివారం అఖిల‌ప‌క్ష భేటీ జ‌రిగింది. ఈ సమావేశంలో మోత్కుపల్లి నర్సింహులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మోత్కుపల్లి.. ‘‘ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉండే అవకాశాన్ని ఈ సమావేశం నిర్వహించడం ద్వారా మీరు సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దళిత సమాజంలో ఒక మానసిక ఉత్తేజం కలిగింది.’’ అని పేర్కొన్నారు. అలాగే.. తెలంగాణ వచ్చిన తర్వాత వివిధ సందర్భాల్లో అన్యాయాలకు గురైన దళిత కుటుంబాలను గుర్తించి, ఆదుకొని వారికి రక్షణ చర్యలు ప్రకటించండని సీఎం కేసీఆర్ ను మోత్కుపల్లి కోరారు. దళిత సాధికారతలో భాగంగా దళారులు లేకుండా నేరుగా దళితులకు ఆర్థికసాయం అందిస్తేనే మేలు జరుగుతుందని మోత్కుపల్లి అభిప్రాయడ్డారు. రైతుబంధు పథకం మాదిరిగా నేరుగా ఆర్థిక సహాయం అందిస్తే దళితులు సంతోషిస్తారని చెప్పారు.

దళితుల కోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడాన్ని తాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని మోత్కుపల్లి పేర్కొన్నారు. యాదగిరిగుట్టను ప్రపంచం గుర్తించే రీతిలో తీర్చిదిద్దుతున్నందుకు, అక్కడి నుంచి ఐదు సార్లు గెలిచిన ప్రజాప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. గురుకుల పాఠశాలలు వచ్చిన తర్వాత దళిత విద్యార్థులు.. కలెక్టరు వంటి ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేయాలనే వారి ఆకాంక్షలు నెరవేరుతుండటం ఆనందదాయకం అన్నారు. ఎస్సీల అభివృద్ది గురించి ఇంతగా తపించే సీఎం కేసీఆర్‌కు భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.

Also read:

Viral clip: పాడైన వాషింగ్ మెషిన్‌లో పెద్ద తేనెతుట్టె.. ఆమె ఎంత సేఫ్‌గా డీల్ చేసిందో మీరే చూడండి