AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bjp vs Trs: రేపు మునుగోడుకు అమిత్ షా.. కేసీఆర్ ప్రశ్నలకు సమాధానమిచ్చేనా?

Bjp vs Trs: సీఎం కేసీఆర్ సభకు దీటుగా.. అమిత్ షా మీటింగ్ జరిగేలా కమలం పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. మునుగోడు ఆత్మగౌరవ సభ పేరుతో జరిగే ఈ సభకు రెండు లక్షల మందిని..

Bjp vs Trs: రేపు మునుగోడుకు అమిత్ షా.. కేసీఆర్ ప్రశ్నలకు సమాధానమిచ్చేనా?
Bjp
Shiva Prajapati
|

Updated on: Aug 20, 2022 | 10:01 PM

Share

Bjp vs Trs: సీఎం కేసీఆర్ సభకు దీటుగా.. అమిత్ షా మీటింగ్ జరిగేలా కమలం పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. మునుగోడు ఆత్మగౌరవ సభ పేరుతో జరిగే ఈ సభకు రెండు లక్షల మందిని తరలించాలని టార్గెట్ పెట్టుకుంది. అందుకు తగినట్టుగా జిల్లాల అధ్యక్షులు, నియోజక వర్గాల ఇంఛార్జ్ లకు ఇప్పటికే బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే మునుగోడు మొత్తం బ్యానర్లతో నిండిపోయింది.

మునుగోడు నుంచి చండూరు వెళ్లే దారిలో 30 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. పత్తి పంట వేసిన రైతులకు ఎకరానికి 60 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించారు. సాయంత్రం 4 గంటలకు సభా ప్రాంగణానికి అమిత్ షా చేరుకుంటారు. మునుగోడు ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇదే వేదిక నుంచి రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు అభ్యర్ధిగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కృష్ణా జలాలపై సమాధానం చెప్పాలని నేరుగా అమిత్ షా ను సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. మరోవైపు బావులకు మీటర్లు పెట్టడం దగ్గర నుంచి అనేక అంశాలపై కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి వీటికి బీజేపీ నేతలు సమాధానం చెప్తారా.. లేక తమదైన స్టైల్‌లో రివర్స్ కౌంటర్ ఇస్తారా అనేది ఉత్కంఠగా మారింది.

ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రాయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి మునుగోడుకు చేరకుంటారు. సాయంత్రం 5గంటలకు మునుగోడులో జరిగే భారీ బహిరంగ సభలో అమిత్​ షా పాల్గొంటారు. మునుగోడు మీటింగ్ తర్వాత బీజేపీ ముఖ్యనేతలతో హైదరాబాద్‌లో అమిత్ షా డిన్నర్‌లో పాల్గొంటారు. బైపోల్స్‌లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు అసెంబ్లీ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..