Khammam: తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ట్విస్ట్.. కోటేశ్వరరావు పేరు తప్పించారంటూ ఆరోపణలు..
Khammam: ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన వ్యక్తి తమ్మినేని కోటేశ్వరరావు అని బాధిత కుటుంబ సభ్యులు
Khammam: ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన వ్యక్తి తమ్మినేని కోటేశ్వరరావు అని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. తాజాగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరే లేదు. దాంతో కేసు విషయంలో పోలీసుల తీరును తప్పుపడుతున్నారు కృష్ణయ్య కుటుంబ సభ్యులు. ఏ1 ముద్దాయిగా తమ్మినేని కోటేశ్వరరావు పేరు ఫిర్యాదులో చేర్చితే ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ ప్రశ్నించారు కృష్ణయ్య కుమార్తె, కుమారుడు. ఆరు రోజుల క్రితం హత్య జరిగితే పోలీస్ వ్యవస్థ ఆలస్యం చేస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ అరెస్ట్ చేసిన ఎనిమిది మంది నిందితులకు, తమకు ఎలాంటి గొడవలు లేవని, కేవలం కోటేశ్వరరావు కోసమే తమ నాన్ను చంపారని ఆరోపించారు.
ఇదిలాఉంటే.. వ్యక్తిగత కక్షలు, ఇతర కారణాలతోనే కృష్ణయ్య హత్య జరిగినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ హత్య కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో ఏ1గా బోడపట్ల శ్రీను, ఏ2గా గజ్జి కృష్ణస్వామి, ఏ3గా నూకల లింగయ్య, ఏ4గా బండారు నాగేశ్వరరావు, ఏ5గా కన్నెగంటి నవీన్, ఏ6గా జక్కంపూడి కృష్ణ, ఏ7గా మల్లారపు లక్ష్మయ్య, ఏ8గా షేక్ రంజాన్ పేర్లను చేర్చారు పోలీసులు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..