TS Speaker Pocharam Srinivas Reddy: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నిన్న రాత్రి హెల్త్ చెకప్‌లో పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు తెలిపారు. దీంతో పోచారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని AIGలో అడ్మిట్ అయ్యారు. కాగా.. మూడు రోజుల కిందటే తన మనువరాలి వివాహ వేడుకల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే. చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో వారు పక్క పక్కనే కూర్చుని స్పీకర్‌తో మాట్లాడారు. సీఎంలతోపాటు ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు ఈ పెళ్లికి హాజరయ్యారు. తనకు పాజిటివ్ రావడంతో అందరూ టెస్ట్ చేసుకోవాలని, ఐసోలేషన్‌లో ఉండాలని స్పీకర్ పోచారం కోరారు.
కాగా.. దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గుతున్న క్రమంలో పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అగ్రనటుడు కమల్ హాసన్, డ్యాన్స్ మాస్టర్ శివశంకర్ కరోనా బారిన పడి చికిత్స పొందతున్న విషయం తెలిసిందే. అయితే శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Also Read: