Telangana Elections: సమయం లేదు మిత్రమా..! ఇక దారులన్నీ తెలంగాణ వైపే.. ప్రచార పర్వంలో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సరిగ్గా వారమే గడువుంది. దీంతో జాతీయ పార్టీల అగ్రనేతలంతా తెలంగాణలోనే మకాం వేయనున్నారు. బీజేపీ తరపున ప్రధాని మోదీ, అమిత్‌షా, కాంగ్రెస్ తరపున ఖర్గే, రాహుల్, ప్రియాంక నెలాఖరువరకూ ప్రచారం నిర్వహించనున్నారు. దీంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పీక్స్‌కు చేరుకుంది. ఈ నెల 28కే ప్రచార గడువు ముగియనుండటంతో నేతలంతా ప్రచారాన్ని పతాకస్థాయికి తీసుకెళ్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సరిగ్గా వారమే గడువుంది. దీంతో జాతీయ పార్టీల అగ్రనేతలంతా తెలంగాణలోనే మకాం వేయనున్నారు. బీజేపీ తరపున ప్రధాని మోదీ, అమిత్‌షా, కాంగ్రెస్ తరపున ఖర్గే, రాహుల్, ప్రియాంక నెలాఖరువరకూ ప్రచారం నిర్వహించనున్నారు. దీంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పీక్స్‌కు చేరుకుంది. ఈ నెల 28కే ప్రచార గడువు ముగియనుండటంతో నేతలంతా ప్రచారాన్ని పతాకస్థాయికి తీసుకెళ్తున్నారు. రేపటితో రాజస్థాన్ ఎన్నికల ప్రచార గడువు ముగియనుండటంతో బీజేపీ, కాంగ్రెస్ జాతీయ అగ్రనాయకులంతా తెలంగాణకు తరలిరానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 25, 26, 27 తేదీల్లో తెలంగాణలోనే మకాం వేయనున్నారు. 3 రోజుల్లో 6 సభల్లో పాల్గొంటారు. బీజేపీ కేడర్‌లో జోష్ నింపడంతో పాటు వ్యూహరచనలో తెలంగాణ బీజేపీ నాయకత్వానికి సలహాలు కూడా ఇవ్వనున్నారు. 25న మహేశ్వరం, కామారెడ్డి సభల్లో పాల్గొంటారు మోదీ. 26న తూఫ్రాన్, నిర్మల్‌లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. 27న మహబూబాబాద్, కరీంనగర్ సభలకు హాజరవుతారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహిస్తారు. అమిత్‌షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, యూపీ సీఎం యోగి కూడా తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్డీయే భాగస్వామ్యపక్షంగా తెలంగాణలో పొత్తు కూడా కుదుర్చుకున్న పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ-జనసేన అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు.
కర్ణాటక బీజేపీ నేతల ప్రచారం..
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి BS యడ్యూరప్ప బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జహీరాబాద్‌లో జరిగే బీజేపీ ర్యాలీలో ప్రసంగించనున్నారు. అలాగే జహీరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. ఎంపీ, బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య వనపర్తిలో జరిగే ర్యాలీ, బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అలాగే కొత్త కోటలో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
మరోవైపు ప్రచారాన్ని మరో లెవెల్‌కి తీసుకెళ్లనున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర నాయకులంతా ఉధృతంగా ప్రచారం చేస్తుండగా అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈనెల 24 నుంచి తెలంగాణలోనే ఉండేలా షెడ్యూల్ ఖరారైంది. వారితో పాటు పలువురు నేతలు కూడా ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే మల్లికార్జున ఖర్గే తెలంగాణలో పర్యటిస్తున్నారు. అంతేకాకుండా పలువురు కర్ణాటక నేతలు కూడా కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొంటున్నారు.
వీడియో చూడండి..
ఇక అధికార బీఆర్‌ఎస్ పార్టీ తరపున సీఎం కేసీఆర్ రోజుకు నాలుగు సభల్లో పాల్గొంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ దూకుడుగా ప్రచారం చేస్తూ గులాబీ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. కేసీఆర్ ఒంటరిగా పోరాడుతున్నారని.. కాంగ్రెస్, బీజేపీ తరపున ఢిల్లీ నేతలు వచ్చి ప్రచారం చేయాలా..? అని ప్రశ్నించారు కేటీఆర్. మిగతా పార్టీల నుంచి ఎంతమంది వచ్చినా కేసీఆర్ ఒక్కడే సింహంలా ప్రచారం చేస్తున్నారని చెప్పారు కేటీఆర్. అయితే, ఈనెల 25న పరేడ్ గ్రౌండ్ వేదికగా నిర్వహించే భారీ బహిరంగ సభను గేమ్ చేంజర్‌గా మార్చేందుకు బీఆర్‌ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..