Telangana Assembly Elections 2023: సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టిన ఎలక్షన్ కమిషన్.. హద్దుమీరితే కఠిన చర్యలు తప్పవు!
తెలంగాణ లో ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికలకు ఇంకా 50 రోజులు సమయం ఉండడంతో పొలిటికల్ పార్టీలన్నీ అభ్యర్థుల ప్రకటన, ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించాయి. మరోవైపు ఎన్నికల సంఘం అధికారులు అభ్యర్థుల ప్రచారంతో పాటు వారి కదలికలపై కన్నేశారు.

తెలంగాణ లో ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికలకు ఇంకా 50 రోజులు సమయం ఉండడంతో పొలిటికల్ పార్టీలన్నీ అభ్యర్థుల ప్రకటన, ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించాయి. మరోవైపు ఎన్నికల సంఘం అధికారులు అభ్యర్థుల ప్రచారంతో పాటు వారి కదలికలపై కన్నేశారు. 22 ఏజెన్సీలతో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌పై ప్రత్యేక నిఘా పెట్టింది ఎన్నికల కమిషన్. అలాగే రాజకీయ, ఇతర సోషల్ మీడియా వెబ్‌సైట్లపైనా ప్రత్యేక దృష్టి సారించింది. వీడియో క్లిప్పులు, సోషల్ మీడియాలో పార్టీల ప్రచారంపై నజర్ వేసింది. ఎన్నికల కోడ్ ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది ఈసీ.
ఎన్నికల సమయంలో అభ్యర్థుల కదలిక, అక్రమ మద్యం, నగదు లావాదేవీలు, డబ్బు తరలింపు, హవాలా మనీపై ఫోకస్ పెట్టింది ఈసీ. ముఖ్యంగా అలాగే అభ్యర్థుల ప్రచార సరళిపై దృష్టి సారించింది. ప్రత్యేకంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల పై నిఘా పెట్టింది. ఇందుకోసం ప్రత్యేక వింగ్ ఏర్పాటుకు సిద్ధం అవుతుంది తెలంగాణ ఈసీ. అన్ని పార్టీల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లు, నాయకుల సపరేట్ సోషల్ మీడియా ఖాతాలు, వారి పోస్టులు, కామెంట్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంది. దీని కోసం స్పెషల్ టీమ్‌ను సైతం సిద్దం చేసింది ఎన్నికల కమిషన్.
ముఖ్యంగా గూగుల్, facebook, ట్విట్టర్ X, Instagram ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా, ఈసీ నిబంధనలకు విరుద్దంగా ఓటర్లను ప్రలోభపెట్టేలా, ఇతర వర్గాలను కించపర్చేలా చేసే పోస్టింగ్‌లపై వివిధ వెబ్‌సైట్ల ద్వారా పర్యవేక్షించడానికి రెఢి అయింది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తప్పవంటోంది ఈసీ. దీంతో పాటు తప్పుడు సమాచారం, ఎన్నికల ప్రచారం వంటి బల్క్ SMSలు చేసినా, రూమర్లను ప్రచారం చేసినా డేగ కన్నుతో వాచ్ చేస్తోంది ఈసీ.
ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రచారాలు, ప్రలోభాలకు గురి చేసేలా పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నది ఎన్నికల కమిషన్. అయితే టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. బహిరంగ ప్రచారంతో పాటు సోషల్ మీడియా ప్రచారాలు బాగా పెరిగాయి. ఎక్కువగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌పై ఈ సారి ప్రత్యేకంగా దృష్టి పెట్టామంటున్నారు ఎన్నికల సంఘం అధికారులు.
ఇదిలావుంటే ఇకపై ప్రజాప్రతినిధులు, మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే తాట తీస్తామంటున్నారు తెలంగాణ పోలీసులు. అసభ్యకరమైన పోస్టులు చేసినా, ఫొటో మార్ఫ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు హైదరాబాద్ క్రైమ్ డీసీపీ స్నేహ మెహ్రా. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులపై ట్రోలింగ్ చేసిన 20 మందిపై కేసులు నమోదు చేసి, 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
