Exams Postponed: అప్పటిదాకా పరీక్షలన్నీ వాయిదా..! విద్యాశాఖ కీలక నిర్ణయం

|

Jul 27, 2023 | 8:05 AM

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల ధాటికి విద్యా సంస్థలకు ప్రభుత్వం వరుసగా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వర్షాల మూలంగా వారం రోజులుగా సెలవులు ప్రకటించడంతో వీటి ప్రభావం పరీక్షల నిర్వహణపై..

Exams Postponed: అప్పటిదాకా పరీక్షలన్నీ వాయిదా..! విద్యాశాఖ కీలక నిర్ణయం
Exams Postponed
Follow us on

హైదరాబాద్‌, జులై 27: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల ధాటికి విద్యా సంస్థలకు ప్రభుత్వం వరుసగా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వర్షాల మూలంగా వారం రోజులుగా సెలవులు ప్రకటించడంతో వీటి ప్రభావం పరీక్షల నిర్వహణపై పడుతోంది. వర్షాలు తగ్గి, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు పరీక్షలన్నింటినీ వాయిదా వేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు వర్సిటీలు, విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే ఓయూ, జేఎన్టీయూ, తెలుగు యూనివర్సిటీల్లో ఇంటర్నల్‌ పరీక్షలతోపాటు ఎంట్రన్స్‌ టెస్ట్‌లు సైతం వాయిదా పడ్డాయి. డిగ్రీ ప్రవేశాల తేదీల్లోనూ మార్పులు చేశారు. దీంతో డిగ్రీ, ఇంజనీరింగ్‌ పరీక్షలు మరింత ఆలస్యం కానున్నాయి. పాఠశాలల్లో జూలైలో జరగాల్సిన ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ–1) పరీక్షలనూ వాయిదా వేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఇక ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాల గడువును జులై 25 నుంచి నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డ్‌ ప్రకటించింది. డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్‌ కౌన్సెలింగ్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ తేదీని జులై 28 వరకూ పొడిగించారు. ఇక ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌కు ఆప్షన్ల గడువు 27తో ముగియనుండగా ఈ నెల 31న సీట్ల కేటాయింపు ఉంటుందని సాంకేతిక విద్య కమిషనరేట్‌ తెలిపింది. అప్పటికి వర్షాలు తగ్గకపోతే రెండో విడత చేరికల తేదీని పొడిగించాలని అధికారులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.