Telangana: అత్తారింటికి వెళ్లి 20 రోజుల క్రితమే మిస్సింగ్‌.. తలలేని మొండెం నీళ్లలో తేలుతూ..

|

Oct 04, 2023 | 4:40 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా చొప్పదండి మండలంలోని రెవెళ్లి గ్రామానికి చెందిన బోయ మల్లయ్య కొన్నేళ్ల క్రితం కూతురు రజితను మల్యాల మండలం పోతారానికి చెందిన ముత్కల గణేశ్‌ (36)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. భార్య, భర్తలిద్దరూ ముంబైలో నివాసం ఉంటూ ఇళ్లలో పనిచేసికుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గణేశ్‌ చేతికి గాయం అయ్యింది. దీంతో రెవెళ్లిలోని అత్తగారింటికి గత నెల 2వ తేదీన వచ్చాడు. అత్తారింటికి వెళ్లిన గణేశ్‌ ఆ తర్వాత కనిపించకుండా..

Telangana: అత్తారింటికి వెళ్లి 20 రోజుల క్రితమే మిస్సింగ్‌.. తలలేని మొండెం నీళ్లలో తేలుతూ..
Man Died In Rajanna Sirisilla
Follow us on

రాజన్న సిరిసిల్ల, అక్టోబర్‌ 4: అత్తారింటికి వచ్చిన ఓ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఆ ఊరి పొలిమేర్లలోని వ్యవసాయ బావిలో శవమై కనిపించడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. పైగా మృతుడి తల మాయం అవడం, మొండెం మాత్రమే లభ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా చొప్పదండి మండలంలోని రెవెళ్లి గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..

రాజన్న సిరిసిల్ల జిల్లా చొప్పదండి మండలంలోని రెవెళ్లి గ్రామానికి చెందిన బోయ మల్లయ్య కొన్నేళ్ల క్రితం కూతురు రజితను మల్యాల మండలం పోతారానికి చెందిన ముత్కల గణేశ్‌ (36)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. భార్య, భర్తలిద్దరూ ముంబైలో నివాసం ఉంటూ ఇళ్లలో పనిచేసికుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గణేశ్‌ చేతికి గాయం అయ్యింది. దీంతో రెవెళ్లిలోని అత్తగారింటికి గత నెల 2వ తేదీన వచ్చాడు. అత్తారింటికి వెళ్లిన గణేశ్‌ ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు సెప్టెంబర్‌ 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో రెవెళ్లి గ్రామంలోని మావురం రాంరెడ్డి వ్యవసాయ బావిలో గణేశ్‌ మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో అనుమానాస్పద స్థితిలో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో తల లేని మొండెంతో ఉన్న మృతదేహం కనిపించింది.

పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించగా తల లేని మొండెం నీళ్లపై తేలుతూ కనిపించింది. మృతుడు ధరించిన పసుపు కలర్‌ చొక్క, బ్లాక్‌ కలర్‌ జీన్స్‌తో, జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ ఆధారంగా మృతదేహం గణేశ్‌దిగా గుర్తించారు. అయితే మృతుడి శరీరంపై తల మాయమవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తల భాగం కుళ్లిపోయి ఊడిపోయిందా లేదా వేరే కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు ఎస్‌ఐ ఉపేంద్ర చారి తెలిపారు. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీం ద్వారా ఆధారాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.