Warangal: కొడుకు వస్తున్నాడనే ఆనందంలో తల్లిదండ్రులు.. అంతలోనే ఊహించని ఘోరం.. ఈ దుర్మార్గులు చేసిన పనికి..

|

Jun 29, 2023 | 12:13 PM

తొలి ఏకాదశి పర్వదినాన ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం కనిపిస్తుంటే.. ఈ ఇంట్లో మాత్రం తీరని విషాదం అలుముకుంది.. సెల్ ఫోన్ కాపాడుకునే ప్రయత్నం యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రాణాలు బలి తీసుకుంది. రైలు మార్గంలో దోపిడీ దొంగల దుర్మార్గం..

Warangal: కొడుకు వస్తున్నాడనే ఆనందంలో తల్లిదండ్రులు.. అంతలోనే ఊహించని ఘోరం.. ఈ దుర్మార్గులు చేసిన పనికి..
Warangal Techie
Follow us on

తొలి ఏకాదశి పర్వదినాన ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం కనిపిస్తుంటే.. ఈ ఇంట్లో మాత్రం తీరని విషాదం అలుముకుంది.. సెల్ ఫోన్ కాపాడుకునే ప్రయత్నం యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రాణాలు బలి తీసుకుంది. రైలు మార్గంలో దోపిడీ దొంగల దుర్మార్గం.. ఈ యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నిండు ప్రాణాలు బలి తీసుకుంది. దొంగల నుండి తన సెల్‌ఫోన్‌ను కాపాడుకునే ప్రయత్నంలో రైలు నుండి జారిపడ్డ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. అదే రైలు కిందపడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన బీబీనగర్ వద్ద జరిగింది. మృతుడి స్వగ్రామం కమలపూర్ మండలం నెరేళ్ల గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీకాంత్ హైదరాబాద్ లోని ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇవాళ సెలవుదినం కావడంతో ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి తొలిఏకాదశి పూజల్లో పాల్గొనేందుకు వస్తున్నాడు. బుధవారం సాయంత్రం శాతవాహన రైల్‌లో సికింద్రాబాద్ నుండి కాజిపేటకు బయలుదేరాడు. బీబీనగర్ సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన కర్రలతో కాపుకాసిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు సెల్ ఫోన్ చోరీకి ప్రయత్నించారు. ఫుట్ బోర్డ్ వద్ద నిలబడి ఉన్న శ్రీకాంత్ చేతిలోని సెల్ ఫోన్‌ను కర్రతో కొట్టి లూటీ చేసేందుకు ప్రయత్నించారు. తన సెల్ ఫోన్ కాపాడుకునే ప్రయత్నంలో శ్రీకాంత్ రైలు నుండి జారిపడ్డాడు. దురదృష్టవశాత్తు అదే రైలుకింద జారిపడడంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సెల్ ఫోన్ లూటీకి ప్రయత్నించిన ఆ దుండగులు అక్కడినుండి పారిపోయారు.

పండుగకు ఇంటికి వస్తున్నానన్న కొడుకు రాకకోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు రాములు -ధనమ్మ.. శ్రీకాంత్ మరణవార్త తెలియగానే బోరున విలపిస్తున్నారు. పండుగ పూట ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. సెల్ ఫోన్ దొంగల స్వార్థం ఇంత దారుణానికి కారణమైంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఆర్పీఎఫ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..