AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సొంత డబ్బులతో విద్యార్థులకు ఆటో.. ప్రభుత్వ బడికి ఊపిరి పోసిన ముగ్గురు ఉపాధ్యాయులు!

Mancherial News: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కత్తెరసాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తమ సొంత జీతంతో విద్యార్థులకు ఆటో సౌకర్యం కల్పిస్తున్నారు. నోటు పుస్తకాలు, మినరల్ వాటర్, మౌలిక సదుపాయాల కోసం కూడా ఖర్చు చేస్తూ ప్రభుత్వ బడిని అభివృద్ధి చేసి విద్యార్థుల సంఖ్యను 14 నుంచి 36కు పెంచి ఆదర్శంగా నిలిచారు.

సొంత డబ్బులతో విద్యార్థులకు ఆటో.. ప్రభుత్వ బడికి ఊపిరి పోసిన ముగ్గురు ఉపాధ్యాయులు!
Teachers Inspiration
Naresh Gollana
| Edited By: |

Updated on: Jul 06, 2026 | 8:10 PM

Share

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కత్తెరసాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రాములు, ఉపాధ్యాయులు సరోజ, శోభారాణి తమ సొంత డబ్బులతో విద్యార్థుల కోసం ఆటో ఏర్పాటు చేసి పాఠశాలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఈ పాఠశాలలో ఐదు తరగతులకు కలిపి కేవలం 14 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా, బదిలీపై వచ్చిన ఈ ముగ్గురు ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను చైతన్యపరిచారు. వారి కృషితో మొదట విద్యార్థుల సంఖ్య 21కు, ప్రస్తుతం 36కు పెరిగింది. మరో నలుగురు విద్యార్థులు కూడా త్వరలో చేరే అవకాశం ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు.

విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు రావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించిన ఉపాధ్యాయులు, మొదట నెలకు రూ.3 వేలతో ఆటో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కత్తెరసాల, సుబ్బరాంపల్లి గ్రామాల విద్యార్థులను ప్రతిరోజూ పాఠశాలకు తీసుకువచ్చి, తిరిగి ఇళ్లకు చేర్చేందుకు నెలకు రూ.5 వేల చొప్పున తమ సొంత డబ్బులు వెచ్చిస్తూ ఆటో నిర్వహిస్తున్నారు.

ఇంతటితో ఆగకుండా, విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, పెన్నులు, పరీక్ష ప్యాడ్లు, రిబ్బన్లు అందించడంతో పాటు తాగునీటి కోసం మినరల్ వాటర్ కూడా తమ ఖర్చులతో అందిస్తున్నారు. అలాగే పాఠశాల ప్రహరీ నిర్మాణం, గేటు, పిల్లలు ఆడుకునే మైదానం, మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా కృషి చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తమ జీతంలో నుంచి ఖర్చు చేస్తూ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఈ ముగ్గురు ఉపాధ్యాయులు నిజంగా సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

వీడియో చూడండి..

Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో