Task Force Police Raids: టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడులు.. రూ.23 లక్షల విలువ చేసే గుట్కా, ఖైనీ ప్యాకెట్ల పట్టివేత

|

Jan 18, 2021 | 8:53 PM

Task Force Police Raids: గుట్కాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు దాడులు చేపడుతున్నా.. ఇంకా రవాణా కొనసాగుతూనే ఉంది. ఓ వాహనంలో తరలిస్తున్న ...

Task Force Police Raids: టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడులు.. రూ.23 లక్షల విలువ చేసే గుట్కా, ఖైనీ ప్యాకెట్ల పట్టివేత
Gutka mafia
Follow us on

Task Force Police Raids: గుట్కాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు దాడులు చేపడుతున్నా.. ఇంకా రవాణా కొనసాగుతూనే ఉంది. ఓ వాహనంలో తరలిస్తున్న రూ.23 లక్షల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లను ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. బొలెరో వాహనంలో గుట్కాప్యాకెట్లు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై సతీష్‌ కుమార్‌, రూరల్‌ ఎస్సై రాము సిబ్బందితో కలిసి రూరల్‌ మండలం ఆటోనగర్‌ వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారు. పాల్వంచ వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో గుట్కా, ఖైనీ ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మేకల ప్రభాకర్‌ అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రం బీదర్‌లో గుట్కా ప్యాకెట్లను కొనుగోలు చేసి పాల్వంచలో చిల్లర దుకణాదారులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ వెంకట్రావ్‌ తెలిపారు. వాహన డ్రైవర్‌ మురళీ, చంటి అనే మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అయితే ప్రభాకర్‌ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన వాహనాన్ని, నిందితులను ఖమ్మం రూరల్‌ పోలీసులకు అప్పగించారు.

Also Read: Mumbai Drugs: రూ.73 లక్షల నగదుతో పాటు డ్రగ్స్‌ పట్టివేత.. మహిళ అరెస్టు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు