నైరుతి రుతుపవనాలు గురువారం వాయువ్య, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి విరమించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం ఉపరితల ద్రోణి తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టం నుంచి 3.1కిమీ ఎత్తు వరకు వ్యాపించి ఉందని ప్రకటించింది. ఈ నెల 10న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి నాలుగైదు రోజుల్లో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్రా తీరానికి చేరుకునే ఛాన్స్ ఉందని వివరించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో గురువారం, శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రాలో రాగల 3 రోజుల్లో వాతావరణం ఇలా ఉండే ఛాన్స్ ఉంది
ఉత్తర కోస్తా ఆంధ్ర-యానాం :
ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే ఛాన్స్ ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఈరోజు, రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే ఛాన్స్ ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:
ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే ఛాన్స్ ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే ఛాన్స్ ఉంది.
Also Read: దేవుడి ఫోటోలు చూసి దండం పెట్టుకునేరు.. తెరిచి చూస్తే పోలీసులకే కళ్లు బైర్లుగమ్మాయి
చాంతాడంత పొడవున్న నాగుపాము.. సింపుల్‌గా నీరు తాగించిన యువకుడు.. షాకింగ్ వీడియో