గ‌జ్వేల్ ఉద్యోగిని హ‌త్య‌కేసులో.. పోలీసులకు లొంగిపోయిన నిందితుడు

| Edited By:

Feb 19, 2020 | 7:51 PM

గజ్వేల్‌‌లో సంచలనం సృష్టించిన బ్యాంకు ఉద్యోగిని దివ్య హత్య కేసులో నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో వేములవాడ పోలీసుల ఎదుట..

గ‌జ్వేల్ ఉద్యోగిని హ‌త్య‌కేసులో.. పోలీసులకు లొంగిపోయిన నిందితుడు
Follow us on

గజ్వేల్‌‌లో సంచలనం సృష్టించిన బ్యాంకు ఉద్యోగిని దివ్య హత్య కేసులో నిందితుడు వెంకటేష్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో వేములవాడ పోలీసుల ఎదుట సరెండర్ అయ్యాడు. దివ్యను హత్య చేసింది తానేనని వెంకటేష్ ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని పోలీసులు గజ్వేల్‌ పీఎస్‌కి తరలించారు. కాగా ఈ సందర్భంగా నిందితుడు వెంకటేష్‌ని పోలీసులు అన్ని కోణాల్లోనూ.. విచారిస్తున్నారు. కాగా ఈ విచారణలో విస్తు పోయే నిజాలు వెల్లడవుతున్నాయి.

దివ్య, వెంకటేష్ 8వ తరగతి చదివే సమయంలోనే మా మధ్య చనువు పెరిగిందని, ఉస్మానియా యూరివర్శిటీలో చదివే క్రమంలో ఇద్దరం ప్రేమలో పడి, ఆర్య సమాజ్‌లో పెళ్లి కూడా చేసుకున్నామన్నాడు. అయితే పెళ్లికి దివ్య కుటుంబ సభ్యులు నిరాకరించారని.. ఆ తరువాత ఆమెను వారితో తీసుకెళ్లి మనసు మార్చి ఇప్పుడు మరో పెళ్లి చేస్తున్నారని నిందితుడు పేర్కొంటున్నాడు. అయితే వీటిల్లో ఎంత నిజం ఉందన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

కాగా గజ్వేల్‌లో స్థానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో పనిచేస్తుంది దివ్య. పెళ్లి ఉండంతో.. తన సహ ఉద్యోగులకి పెళ్లి కార్డు పంచి.. ఇంటికి తిరిగి వచ్చింది. అనంతరం తనకు కాబోయే భర్తతో ఫోన్ మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా ఆమెపై దాడిచేసి హతమార్చాడు నిందితుడు వెంకటేశ్.