Delhi Liquor Policy Case: ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు.. కీలక ఆదేశాలు..

Delhi liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది.

Delhi Liquor Policy Case: ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు.. కీలక ఆదేశాలు..
Mlc Kavitha

Edited By:

Updated on: Apr 05, 2024 | 5:58 PM

Delhi liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది. ED అరెస్టును సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కోరుతూ పిటిషన్ లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అంతేకాకుండా.. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సంజీవ్ ఖన్నా, సుందరేశ్, బేలా ఎం. త్రివేది ధర్మాసనం సూచించింది. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన ధర్మాసనం.. ఆరు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.

బెయిల్ గురించి ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే,బెయిల్‌ పిటిషన్‌పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్‌ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. కగా.. పిటిషన్‌లో లేవనెత్తిన ఇతర అంశాలపై ధర్మాసనం విచారణకు అంగీకరించింది. దానిపై ప్రస్తుతం విచారణ జరుపుతోంది.

లైవ్ వీడియో చూడండి..

ఇదిలాఉంటే.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై సుప్రీంకోర్టు అత్యవసర విచారణకు అంగీకరించింది. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ ఆప్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. కాగా.. మధ్యాహ్నం రెండున్నరకు కోర్టు ముందు కేజ్రీవాల్‌ ను ప్రవేశపెట్టనున్నారు. 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరనున్నట్లు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.