Telangana: నీరాతో చక్కెర తయారీ.. నువ్వు సూపర్ అమ్మాయ్..

నీరా చూసేందుకు కొబ్బరినీళ్లలా ఉంటుంది. తాగితే ముంజెల టేస్ట్ ఉంటుంది. ఇందులో ఆల్కహాల్‌ ఉండదు. పోషకాలు, ఔషధ గుణాలు పుష్కలం. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న నీరాతో చక్కెర తయారు చేస్తే ఎలా ఉంటుంది. ఇదే ఆలోచన వచ్చింది ఈ అమ్మాయికి. ఆపై మడమ తిప్పకుండా ముందుకు సాగింది..

Telangana: నీరాతో చక్కెర తయారీ.. నువ్వు సూపర్ అమ్మాయ్..
Sriya Nerella

Updated on: Apr 11, 2024 | 1:33 PM

ప్రజంట్ జనరేషన్‌లో రెండు రకాల వాళ్లు ఉన్నారు. కొందరు రీల్స్ చూస్తూ.. టైమ్ పాస్ చేస్తుంటే.. మరికొందరు కొత్త ఆలోచనలతో అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారు. అలానే.. నీరా నుంచి చక్కెర తయారు చేస్తూ అందర్నీ ఆశ్యర్యపరుస్తుంది ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన  శ్రియ నేరెళ్ల. తాటి, ఈత, ఖర్జూర చెట్ల నుంచి కల్లు తీస్తారన్నది మనందరికీ తెలిసిన విషయమే. అయితే సూర్యదయం కంటే ముందే సేకరిస్తే దాన్ని నీరా అంటారు. ఈమె ఫైన్‌ఆర్ట్స్‌లో ఇంజినీరింగ్‌ చేసింది.  ఆ తర్వాత పామ్‌ జాగరీ సబ్జెక్టులో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. కేరళలో కొబ్బరి పాలతో చక్కెర తయారు చేయడం ఆమెను ఆకర్షించింది. అయితే ఈమె కాస్త వినూత్నంగా నీరాతో చక్కెర తయారు చేస్తే ఆదరణ ఉంటుందని భావించింది. ఆ దిశగా పూర్తి సమాచారం సేకరించింది. పరిశ్రమలకు పరీశీలన కోసం వెళ్లడం, శాస్త్రవేత్తల నుంటి టిప్స్ తీసుకోవడం అన్నీ చేసింది. అన్నీ వర్కువట్ అవ్వడంతో.. ఫామ్ పెట్టాలని డిసైడయ్యింది.

నీరా లభ్యత ఎక్కువగా ఉండే మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లాలో సంస్థను ఏర్పాటు చేసింది. నీరా సేకరణ కోసం స్థానిక గిరిజనులతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే పరిశ్రమ స్థాపనకు చాలా డబ్బు అవసరం అవుతుంది. పెట్టుబడి కోసం ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద రూ.50లక్షల లోన్ తీసుకుంది. పేరెంట్స్, ఫ్రెండ్స్ మరో రూ.30లక్షలు సమకూర్చారు. సీపీసీఆర్‌ఐ వారు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చారు. ఇంకేముంది.. ఆమె కల సాకారమైంది.  ‘కానుక’ ఆర్గానిక్స్‌ పేరుతో పోయిన సంవత్సరం నీరా షుగర్‌ని మార్కెట్లోకి తెచ్చారు.  తెలుగు స్టేట్స్‌తో పాటు, ఈ-కామర్స్‌ సంస్థలు ఆమె ప్రొడక్ట్ విక్రయించేందుకు ముందుకు వచ్చాయి. అయితే చక్కెరతో పాటు నీరా బెల్లాన్నీ ఆమె సమాంతరంగా ఉత్పత్తి చేస్తున్నారు. రిస్క్ చేయకపోతే.. లైఫ్ లేదు.. భయపడుతూ ఉంటే..  ఎప్పటికీ ఎదగలేం అని చెబుతున్నారు ఈ నారీమణి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..