ఆదర్శ రైతు.. ప్లాస్టిక్‌తో.. కొత్తగా..

| Edited By:

Mar 12, 2019 | 11:08 AM

ప్లాస్టిక్ వల్ల ఎన్నో అనర్థాలు ఉంటాయని తెలుసు. కానీ.. ఆ ప్లాస్టిక్‌నే తనకు ఆదాయాన్ని సమకూర్చే సాధనంగా వాడుకుంటున్నాడో రైతు. మహబూబాబాద్ జిల్లా ధాన్యతండాకు చెందిన బానోత్ నంద్యా అనే రైతులను అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఎందుకంటే తనకున్న పొద్దుతిరుగుడు పంటను కాపాడుకునేందుకు అతను ప్లాస్టిక్ కవర్లను వాడుతున్నాడు. పంట చేతికొచ్చే టైమ్‌లో పిచ్చుకలు, చిలుకలు వచ్చి గింజలన్నీ తింటుండటంతో.. ఎలాగైనా తన పంటను కాపాడుకోవాలని భావించాడు నంద్యా. అందులో భాగంగానే పొద్దుతిరుగుడు పువ్వులకు ప్లాస్టిక్ కవర్లు […]

ఆదర్శ రైతు.. ప్లాస్టిక్‌తో.. కొత్తగా..
Follow us on

ప్లాస్టిక్ వల్ల ఎన్నో అనర్థాలు ఉంటాయని తెలుసు. కానీ.. ఆ ప్లాస్టిక్‌నే తనకు ఆదాయాన్ని సమకూర్చే సాధనంగా వాడుకుంటున్నాడో రైతు. మహబూబాబాద్ జిల్లా ధాన్యతండాకు చెందిన బానోత్ నంద్యా అనే రైతులను అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఎందుకంటే తనకున్న పొద్దుతిరుగుడు పంటను కాపాడుకునేందుకు అతను ప్లాస్టిక్ కవర్లను వాడుతున్నాడు.

పంట చేతికొచ్చే టైమ్‌లో పిచ్చుకలు, చిలుకలు వచ్చి గింజలన్నీ తింటుండటంతో.. ఎలాగైనా తన పంటను కాపాడుకోవాలని భావించాడు నంద్యా. అందులో భాగంగానే పొద్దుతిరుగుడు పువ్వులకు ప్లాస్టిక్ కవర్లు చుట్టాడు. కవర్లు ఉండటంతో ఇప్పుడు పక్షులు తన పంటను ఏం చేయడం లేదని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.