కరీంనగర్ జిల్లాలో వెకిలిచేష్టలు చేసిన ఓ లెక్చరర్‌కు స్థానికులు దేహశుద్ది చేశారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో ఇన్విజిలేటర్‌గా పనిచేస్తున్న వెంకటేష్ ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు, యువతి బంధువులు లెక్చరర్‌ను చితకబాదారు. అయితే.. తాను తప్పు చేసినట్టు నిందితుడు వెంకటేష్ స్వయంగా లేఖ రాయడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.