Accident: బైక్ పై నుంచి కిందపడి లేవబోతుండగా.. యువకుడి తలపై నుంచి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

|

Mar 26, 2022 | 9:30 AM

జీవితంలో ఉన్నతంగా స్థిరపడి తమను బాగా చూసుకుంటాడనుకున్న ఆ తల్లిదండ్రులు ఆశలు ఆశలుగానే మిగిలపోయాయి. పై చదువులు చదివి గొప్ప స్థాయికి వెళ్లాల్సిన ఆ విద్యార్థిపై మృత్యువు పంజా విసిరింది. మరికొద్ది రోజుల్లో...

Accident: బైక్ పై నుంచి కిందపడి లేవబోతుండగా.. యువకుడి తలపై నుంచి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
Accident
Follow us on

జీవితంలో ఉన్నతంగా స్థిరపడి తమను బాగా చూసుకుంటాడనుకున్న ఆ తల్లిదండ్రులు ఆశలు ఆశలుగానే మిగిలపోయాయి. పై చదువులు చదివి గొప్ప స్థాయికి వెళ్లాల్సిన ఆ విద్యార్థిపై మృత్యువు పంజా విసిరింది. మరికొద్ది రోజుల్లో పరీక్షలు రాసి పై చదువులకు వెళ్లాల్సిన అతను రోడ్డు ప్రమాదంలో(Road Accident) విగతజీవిగా మారాడు. బైక్ పై నుంచి కింద పడ్డ ఆ యువకుడిపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో అతను దుర్మరణం(Death) పాలయ్యాడు. కష్టపడి చదివి అండగా నిలుస్తాడనుకున్న కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తెలంగాణలోని కొత్తగూడెం(Kothagudem) పట్టణానికి చెందిన నర్సింహా స్థానిక మున్సిపాలిటీలో జవానుగా పనిచేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సాయిచరణ్ లక్ష్మిదేవిపల్లిలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ రెండో ఏడాది చదువుతున్నాడు. రోజూ మాదిరిగానే కళాశాలకు వెళ్లిన సాయిచరణ్ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సమీప బంధువైన మరో విద్యార్థి బైక్ పై ఇంటికి బయల్దేరాడు. వాహనం నడుపుతున్న సాయిచరణ్‌ ప్రధాన రహదారిపై యూ టర్న్‌ తీసుకున్నాడు. అక్కడ రోడ్డు పునర్నిర్మాణానికి తెప్పించిన ఇసుక, సిమెంటు బిళ్లలు ఉన్నాయి. యూ టర్న్ తీసుకునే క్రమంలో బైక్ సిమెంటు బిళ్లలపైకి ఎక్కింది. ఈ ఘటనపో ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడింది. వెనుకాల కూర్చున్న యువకుడితో పాటు సాయిచరణ్ కింద పడిపోయాడు.

అదే సమయంలో భద్రాచలం నుంచి కొత్తగూడెం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు సాయిచరణ్ తల మీదుగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సాయిచరణ్ హెల్మెట్ ధరించినా ప్రాణం దక్కలేదు. బస్సు డ్రైవర్‌ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే తన కుమారుడు మృతి చెందాడంటూ తండ్రి నర్సింహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Also Read

Mahesh Babu : ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే న్యూస్.. ఆ మాస్ దర్శకుడికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?

Electricity Fraud: విద్యుత్ శాఖలో వింత మోసం బట్టబయలు.. మీటరున్నా.. బిల్లు రాకపోవడంతో అనుమానం!

సరికొత్త ప్రేమ కథా చిత్రమ్‌.. 67 ఏళ్ల మహిళ.. 28 ఏళ్ల అబ్బాయి..!