Hyderabad: తర్వలో ఈ-కామర్స్ వేదికలపైకి ‘వీధివ్యాపారులు’.. సన్నాహాలు చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు..

తర్వలో వీధి వ్యాపారులు 'ఈ కామర్స్' ఫ్లాట్‏ఫాంపైకి రాబోతున్నారు. ప్రముఖ ఆన్‏లైన్ మార్కెట్ సంస్థలు జోమాటో, స్విగ్గీ, ఉబర్ లాంటి ఈ కామర్స్ ఫ్లాట్‏ఫాంలలో

Hyderabad: తర్వలో ఈ-కామర్స్ వేదికలపైకి 'వీధివ్యాపారులు'.. సన్నాహాలు చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 07, 2021 | 3:22 PM

తర్వలో వీధి వ్యాపారులు ‘ఈ కామర్స్’ ఫ్లాట్‏ఫాంపైకి రాబోతున్నారు. ప్రముఖ ఆన్‏లైన్ మార్కెట్ సంస్థలు జోమాటో, స్విగ్గీ, ఉబర్ లాంటి ఈ కామర్స్ ఫ్లాట్‏ఫాంలలో వీధివ్యాపారులను చేర్చేందుకు జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ ప్రక్రియను తర్వలోనే ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో అహ్మదాబాద్, చెన్మై, ఢిల్లీ నగరాల్లోని వీధివ్యాపారులు పలు ఈ కామర్స్ వేదికలపై తమ వ్యాపారాన్ని అభివృద్ది చేసుకున్నారు. ఇక హైదరాబాద్ పరిధిలోని స్ట్రీట్ వెండర్స్‏ కూడా ఆన్‏లైన్ మార్కెట్లలో తమ వ్యాపారాభివృద్ధిని చేసేందుకు అధికారులను తోడ్పాటు అందించనున్నారు.

వీధి వ్యాపారులకు ప్రభుత్వ పథకాలను అందించేందుకు వారి పూర్తి బయోడేటాను సేకరించేందుకు ఓ ప్రత్యేక యాప్‏ను రూపొందించారు. వీధివ్యాపారులకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను వర్తింపజేసేందుకు ‘మై భి డిజిటల్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది జీహెచ్ఎంసీ. జనవరి 22 వరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘మై భి డిజిటల్’ పై అవగాహన కల్పించనుంది. దీంతో వీధి వ్యాపారుల ఆర్థికాభివృద్ధికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సులభంగా చేర్చవచ్చు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో పలు జోన్లను గుర్తించి అక్కడ వీధివ్యాపారులు వారి విక్రయాలు జరుపుకునేందుకు అవకాశం కల్పించారు. అంతేకాకుండా రోజూ వారి వ్యాపారాలు చేసేందుకు వీలుగా.. గ్రీన్ జోన్ అని, అలాగే తాత్కలికంగా వ్యాపారాలు చేసే జోన్లు యాంబర్ జోన్లుగా.. ఇక పూర్తిగా వ్యాపారం చేయడానికి వీలులేని ప్రదేశాలను రెడ్ జోన్లుగా ఎంపిక చేస్తున్నారు. వీరిలో ఎక్కువగా చదువుకోని వారు ఉండడంతో వారి వ్యాపారాభివృద్దికి జీహెచ్ఎంసీ అర్బన్ కమ్యూనిటీ డెవలప్‏మెంట్ (యూసీడీ) విభాగం కావాల్సిన శిక్షణ ఇవ్వనుంది.

Also Read: త్వరలోనే దేశీ ఈ కామర్స్ సంస్థల ఏర్పాటు.. నిపుణుల కమిటీ వేసిన కేంద్ర ప్రభుత్వం.. నియమ, నిబంధనల రూపకల్పన