Adilabad: తనిఖీలకు వెళ్లిన వారికి ఊహించని ఇన్సిడెంట్.. ఫ్లయింగ్ స్క్వాడ్ కారుపై రాళ్ల దాడి.. వాళ్ల పనేనా..?

|

Jan 11, 2023 | 6:42 PM

డిగ్రీ సెమిస్టర్ పరీక్షల తనిఖీల కోసం వచ్చిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పై రాళ్ల దాడి జరిగిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో జరిగింది. స్వ్కాడ్ ప్రయాణిస్తున్న కారు పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసి పరారయ్యారు....

Adilabad: తనిఖీలకు వెళ్లిన వారికి ఊహించని ఇన్సిడెంట్.. ఫ్లయింగ్ స్క్వాడ్ కారుపై రాళ్ల దాడి.. వాళ్ల పనేనా..?
Stone Attack In Ichoda
Follow us on

డిగ్రీ సెమిస్టర్ పరీక్షల తనిఖీల కోసం వచ్చిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పై రాళ్ల దాడి జరిగిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో జరిగింది. స్వ్కాడ్ ప్రయాణిస్తున్న కారు పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసి పరారయ్యారు. దాడి జరిగినప్పుడు కారులో ముగ్గురు ఫ్లయింగ్ స్క్వాడ్ లు ఉన్నారు. రాళ్లు విసరడంతో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇచ్చోడలో ఈరోజు ఒక్కరోజే 20 మంది డిబార్ కావడంతో విద్యార్థులే చేసి ఉంటారని స్క్వాడ్ బృందం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడి విషయాన్ని మౌఖికంగా పోలిసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనకు పాల్పడిందెవరనే అంశంపై పోలీసులు ప్రాథమిక విచారణ చేపడుతున్నారు.

ఇచ్చోడ మండల కేంద్రంలోని సాయి సమత్, వివేకానంద, ఛత్రపతి, కాకతీయ డిగ్రీ కళాశాలల్లో వారం రోజుల నుంచి కాకతీయ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు నడుస్తున్నాయి. ముందుగా సాయి సమత్ డిగ్రీ కళాశాలలో తనిఖీలు చేయగా మాస్ కాపీలకు పాల్పడుతున్న పన్నెండు మంది విద్యార్థులను పట్టుకున్నారు. వివేకానంద డిగ్రీ కళాశాలలో పలువురు విద్యార్థులను డిబార్ చేశారు. డిబార్ అయిన విద్యార్థులు ఆగ్రహంతో ప్లయింగ్ స్క్వాడ్ల వాహనం పై రాళ్లతో దాడి చేసి అద్దాలను పగలగొట్టినట్లు తెలుస్తోంది.

Attack On Car

మరోవైపు.. కాలేజీలు తమ ఫలితాలను గొప్పగా చూపించుకోవడానికి సెమిస్టర్ పరీక్ష కేంద్రాల్లో జోరుగా మాస్ కాపీకి ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిబార్ అయిన విద్యార్థులతో రాళ్ల దాడి చేయించినట్లు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..