కాలగర్భంలో కలిసిపోతున్న పురాతన సంపద.. తవ్వేకొద్దీ బయటపడుతున్న విగ్రహాలు.. ఎక్కడో తెలుసా..?

| Edited By: Balaraju Goud

Jun 30, 2024 | 10:33 AM

ఈ గ్రామాన్ని.. ఆలయాలతో పేర్చినట్లు ఉంటుంది.. పురాతన మట్టి పరిమళిస్తోంది. ఈ గ్రామంలో అడుగు పెడుతే, దేవలోకంలోనే ఉన్నామనే భావన కలుగుతుంది. గ్రామంలో చుట్టు ఎత్తైన కొండలు, ప్రకృతి రా.. రమ్మని పిలుస్తుంది. అడుగడుగునా ఆలయాలు.. దేవతా మూర్తుల విగ్రహాలు.. చూడటానికి రెండు కళ్లు కూడా చాలవు. ఇలాంటి పురాతన గ్రామం నిర్లక్ష్యానికి గురవుతోంది

కాలగర్భంలో కలిసిపోతున్న పురాతన సంపద.. తవ్వేకొద్దీ బయటపడుతున్న విగ్రహాలు..  ఎక్కడో తెలుసా..?
Historical Temple
Follow us on

ఈ గ్రామాన్ని.. ఆలయాలతో పేర్చినట్లు ఉంటుంది.. పురాతన మట్టి పరిమళిస్తోంది. ఈ గ్రామంలో అడుగు పెడుతే, దేవలోకంలోనే ఉన్నామనే భావన కలుగుతుంది. గ్రామంలో చుట్టు ఎత్తైన కొండలు, ప్రకృతి రా.. రమ్మని పిలుస్తుంది. అడుగడుగునా ఆలయాలు.. దేవతా మూర్తుల విగ్రహాలు.. చూడటానికి రెండు కళ్లు కూడా చాలవు. ఇలాంటి పురాతన గ్రామం నిర్లక్ష్యానికి గురవుతోంది. ఒక్కసారి. పురాతన ఆలయ గ్రామం గురించి తెలుసుకుందాం.

కరీంనగర్ జిల్లా కేంద్రానికి 9 కిలో మీటర్ల దూరంలో నగునూర్ గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో 400 ఆలయాలు కొలువుదీరినట్లు చరిత్ర చెబుతోంది. గతంలో నన్నూరు గ్రామంగా పిలిచేవారు. వాడుక భాషలో నగునూర్‌గా మారిపోయింది. కాకతీయులు ఈ ప్రాంతాన్ని కేంద్రంగా పాలించారు. ఈ గ్రామం చుట్టూ రెండు కొండలు.. ఈ కొండల నుంచి శత్రువుల రాకను పసిగట్టేవారట. కాకతీయులు ఎక్కడైతే పాలన చేస్తారో అక్కడ ఆధ్యాత్మిక వాతవరణం పరిడమిల్లిందని చరిత్ర చెబుతోంది. కాకతీయులు పరమ శివభక్తులు. శివుడి ఆలయాలతోపాటు నంది విగ్రహాలను ప్రతిష్టించారు. ఆలయాల ఏదుట భారీ ధ్వజ స్తంభాలు, సొరంగ మార్గాలు ఎన్నెన్నో నిర్మిచారు. నగునూర్ లో కాకతీయులకు సంబంధించిన అనవాళ్లు ఇప్పటికీ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయి.

దక్షిణ భారతంలోనే ఎర్ర బండతో తయారు చేసిన ఆలయం ఇక్కడ మాత్రం ఉండటం విశేషం. ఇది త్రికుట ఆలయం. .ఆలయం లోపల మూడు ప్రాంతాల్లో భారీ సైజుల్లో ఉన్న శివలింగాలు ఉన్నాయి. ఇలాంటి పురాతన ఆలయం ఇప్పుడు శిథిలావస్థలోకి చేరుకుంది. అయినప్పటికీ ధ్వజస్తంభాలు, ఇతర ఆనవాళ్లు చెక్కు చెదుర లేదు. ఈ గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు చేస్తే, ఎదో ఒక్క పురాతన ఆలయం బయటపడుతూనే ఉంది. పురాతన ఆలయ నిర్మాణ ఆనవాళ్లు కనబడుతున్నాయి. అందమైన కోనేరులు, పురాతన మంచి నీటి బావులు దర్శనమిస్తున్నాయి.

ఇటీవల ఓ ఇంటి నిర్మాణం కోసం తవ్వకాల జరిపితే, పురాతనమైన నంది విగ్రహం బయటకు వచ్చింది. ఈ విగ్రహాన్ని తీయడానికి ప్రయత్నించినా పైకి రాలేదు. ఇప్పటికీ మట్టిలోనే కూరుక్కుపోయింది. వీటితోపాటు ఇతర విగ్రహాలు కనబడుతున్నాయి. దాదాపు ఈ గ్రామం చుట్టూ ఏదో ఒక్క వస్తువు లభ్యమవుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. భారీ విగ్రహాలు సైతం కనబడుతున్నాయి. ఇలా చాలా చోట్ల ఆలయాలు బయటకు కనబడుతున్నాయంటున్నారు. ఇక్కడ వెలుగు చూస్తున్న శివలింగాలు అద్భుతంగా ఉన్నాయంటున్నారు. వందల సంవత్సరాలు గడుస్తున్నా వెక్కు చెదరలేదు. అధికారుల నిర్లక్ష్యానికి ఎన్నో విగ్రహాలు, ఆలయ నిర్మాణాలు మట్టిలోకి కూరుక్కుపోతున్నాయంటున్నారు స్థానికులు.

మరోవైపు, ఈ గ్రామంపై గుప్తు నిధుల ముఠాల కన్నుపడింది. అడుగడమునా తవ్వకాలు జరిపి భయాందోళనలకు గురి చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. కొద్ది రోజుల బయటపడ్డ నంది విగ్రహాన్ని మరింతగా తవ్వే ప్రయత్నం చేశారు. నంది విగ్రహం కింద పెద్ద ఎత్తున నిధులు ఉంటాయని ప్రయత్నం చేశారు. కానీ, విగ్రహం బయటకు రాలేదు. దీంతో పగులగొట్టారు. అదే విధంగా ధ్వజస్తంభం ఉన్న విగ్రహాలను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు. అలాగే గ్రామ శివారులని గుట్టపై కూడా తవ్వకాలు చేస్తున్నారు. గతంలో తమకు గుప్త విధుల ముఠాతో.. భయం ఉందని స్థానికులు అంటున్నారు. ఇదే విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని, ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ధాలని కోరుతున్నారు. కరీంనగర్ కు నగునూర్ దగ్గర ఉండటంతో పెద్ద ఎత్తు పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది మొత్తానికి.. అడుగు అడుగునా దేవాలయాలు ఉన్నాయి.. ఈ గ్రామానికి ఎంతో చరిత్ర ఉన్న పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు. గ్రామంలో 400 పైనా దేవాలయాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన చరిత్ర ఆధారాలు లభిస్తున్నాయని అంటున్నారు. ఈ గ్రామాన్ని కాపాడాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..