Nizamabad: సాధారణ పావురం అనుకుని పట్టుకున్న బాలుడు.. పరీక్షగా చూడగా దాని కాలికి

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ఓ పావురం కలకలం రేపింది. భవానిపేటలో ఓ బాలుడు పట్టుకున్న ఆ పావురం కాలి వద్ద కోడ్ లెటర్స్‌తో ట్యాగ్ ఉండటంతో గ్రామంలో గూఢచారి పావురం అనుమానాలు మొదలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు పక్షిని పీఎస్‌కు తరలించి విచారణ చేపట్టారు.

Nizamabad: సాధారణ పావురం అనుకుని పట్టుకున్న బాలుడు.. పరీక్షగా చూడగా దాని కాలికి
Pigeon

Updated on: Aug 19, 2025 | 7:04 PM

నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఒక పావురం కలకలం రేపింది. మండలంలోని భవానిపేట గ్రామంలో ఓ మైనర్ బాలుడు ఆ పావురాన్ని పట్టుకున్నాడు. సాధారణ పావురం అనుకుని పట్టుకోగా.. చూసే సరికి దాని కాలి వద్ద ప్రత్యేకమైన కోడ్ లెటర్స్‌తో ట్యాగ్ కట్టి ఉండటంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇది సాధారణ పావురం కాదని, గూఢచారి పావురం అంటూ పుకార్లు మొదలయ్యాయి. దీంతో అనుమానాస్పద పావురంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే బోధన్ పోలీసులు ఆ పావురాన్ని పీఎస్‌కు తరలించి విచారణ ప్రారంభించారు. పావురం కాలి వద్ద ఉన్న ట్యాగ్‌పై ఉన్న కోడ్ లెటర్స్‌ ఏ దేశం నుంచి వచ్చాయి? ఎవరు వదిలారు? ఏదైనా రహస్య గూఢచార మిషన్‌లో భాగమా? లేక పరిశోధన లేదా రేసింగ్ కోసం వదిలారా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామస్తులు మాత్రం ఆ పావురం గురించి భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేసి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.