
దేశవ్యాప్తంగా పలు కోర్టుల్లో మసీదులపై నడుస్తున్న కేసుల గురించి సుదీర్ఘంగా చర్చించేందుకు ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు 18వ తేదీ కీలక సమావేశం నిర్వహించనుంది. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి దేశంలోని ముస్లిం మత పెద్దలతో పాటు, రాజకీయ నేతలు, ఎంఐఎం నాయకులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా కోర్టుల్లో మసీదులపై ఉన్న కేసులతో పాటు కాశీ, మధుర, జ్ఞానవాపి మసీద్ అంశాలపై కూడా ప్రదానంగా చర్చ జరగనుంది. ఈ సమావేశంలో పలు తీర్మానాలను కూడా చేయనున్నారు.
మసీదుల్లో ఐదు పూటలా కచ్చితంగా నమాజ్ చేయాలని, మసీదులకు వచ్చేవారి సంఖ్య కూడా తగ్గకుండా చూసుకోవాలని తీర్మానించనున్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మసీదులను ఎలా కాపాడుకోవాలి. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలన్నదానిపై పెద్దలంతా కలిసి చర్చించుకోనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు ఈరోజు జరిగే సమావేశంపైనే ఫోకస్ చేశాయి. ఈ సమావేశం రాబోయే ఎన్నికలతో పాటు ముస్లిం ఓటు బ్యాంక్‌పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..