
నైరుతి రుతుపవనాలు ముందుగానే రానున్నాయా…? భారత వాతావరణ శాఖ అదే అంటోందా…? అవును భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ముందస్తు అంచనా ప్రకారం నైరుతి రుతుపవనాలు శుక్రవారం దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఐఎండీ మరోసారి ధ్రువీకరించింది. అదే విధంగా ఈ నెల 23న తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. ఇది బలపడి 27, 28 నాటికి పశ్చిమ బెంగాల్… బంగ్లాదేశ్ తీరాల దిశగా పయనించనుందని నిపుణులు వెల్లడిచారు.
దీని ప్రభావంతో ఈ నెల 26 తర్వాత కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేశారు. కాగా, తెలంగాణలో ఒకటి, రెండు ప్రదేశాల్లో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తౌక్తే తుఫాను తెలంగాణ నుంచి వెళ్లిపోయిందని వివరించారు.
ఇవి కూడా చదవండి : కేవలం 70 నిమిషాల్లో సెంచరీ… క్రికెట్ చరిత్రలో విధ్వంసక ఆటగాడు.. వీరేందర్ సెహ్వాగ్, క్రిస్ గేల్ కంటే ముందు వరసలో..