SCR: రికార్డు సృష్టించిన దక్షిణ మధ్య రైల్వే.. ప్రధాన మార్గాల్లో విద్యుదీకరణ పనులు పూర్తి

|

Apr 03, 2022 | 12:19 PM

మిషన్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధిక ప్రాధాన్యతనిచ్చింది. విద్యుదీకరణపై ప్రత్యేక దృష్టి సారించడంతో 2021-22 సంవత్సరంలో తన నెట్‌వర్క్‌ పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా అత్యుత్తమ పనితీరును కనబరిచింది...

SCR: రికార్డు సృష్టించిన దక్షిణ మధ్య రైల్వే.. ప్రధాన మార్గాల్లో విద్యుదీకరణ పనులు పూర్తి
Scr Electrification
Follow us on

మిషన్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధిక ప్రాధాన్యతనిచ్చింది. విద్యుదీకరణపై ప్రత్యేక దృష్టి సారించడంతో 2021-22 సంవత్సరంలో తన నెట్‌వర్క్‌ పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా అత్యుత్తమ పనితీరును కనబరిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 770 కిలోమీటర్ల రైల్వే విద్యుదీకరణ(Electrification) పనులు పూర్తి చేసింది. ఇది జోన్‌ చరిత్రలో ఆల్‌టైమ్‌ రికార్డు. అంతేకాకుండా 2021-22 సంవత్సరంలో భారతీయ రైల్వేలో ఏ జోన్‌ కూడా పూర్తి చేయని విధంగా దక్షిణ మధ్య రైల్వే అత్యధికంగా విద్యుదీకరణను పూర్తి చేసింది. జోన్‌(Zone) లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విద్యుదీకరణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. చివరి దశల్లో ఉన్న పనులపై ప్రత్యేక దృషి సారించారు. తెలంగాణలో 326 కి.మీలు, ఆంధ్రప్రదేశ్‌లో 331 కి.మీలు, మహారాష్ట్రలో 87 కి.మీలు, కర్ణాటకలో 27 కి.మీలు ఉన్నాయి. తెలంగాణలో 326 కి.మీల విద్యుదీకరణలో 85.60 కి.మీల ఉందానగర్‌ – మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యింది. 57.70 కి.మీల గద్వాల్‌ – రాయచూర్‌ 45.10 కి.మీలు, మోర్తాడ్‌ – నిజామాబాద్‌ విద్యుదీకరణ పూర్తితో లింగంపేట జగిత్యాల – నిజామాబాద్‌ ప్రాజెక్టు మొత్తం పూర్తైంది. 25.85 కి.మీల నిజామాబాద్‌ – బోధన్‌ 37.55 కి.మీల భద్రాచలం – భవనపాలెం 40.13 కి.మీలు, పింపల్‌కుట్టి – కోసాయి 33.72 కి.మీలు, కోహిర్‌ డక్కన్‌ – ఖానాపూర్‌ మార్గాల్లో విద్యుదీకరణ పూర్తైంది.

ఆంధ్రప్రదేశ్‌ లో 331 కి.మీల విద్యుదీకరణలో 45.53 కి.మీల ఆరవల్లి – భీమవరం – నర్సాపూర్‌, కదిరి – తుమ్మనంగుట్ట మధ్య 53.30 కి.మీలు, పాకాల – కలికిరి మధ్య 55.80 కి.మీలు, డోన్‌ – కర్నూలు సిటీ మధ్య 54.20 కి.మీలు, ఎర్రగుంట్ల – నంద్యాల మధ్య 122.32 కి.మీలు ఉన్నాయి. మహారాష్ట్రలో లోహోగడ్‌ – వాసిం 37.15 కి.మీలు, ఆంకాయ్‌ – రోటేగావ్‌, పింపల్‌కుట్టి – కోసాయి మధ్య 4.17 కి.మీలు ఉన్నాయి. కర్ణాటకలో 26 కిమీల విద్యుదీకరణ కోహిర్‌ డక్కన్‌ – ఖానాపూర్‌ మధ్య జరిగింది.

రైల్వే లైన్ల విద్యుదీకరణతో రైలు ఇంజిన్‌ మార్పు చేయవల్సిన అవసరం లేకపోవడంతో నిరాటంకంగా రైళ్లను నడపవచ్చు. మార్గ మధ్యలో ప్రయాణికుల, సరకు రవాణా రైళ్ల నిరీక్షణను తగ్గించే అవకాశాలు ఉండడంతో రైళ్ల వేగం మెరుగవుతుంది. సెక్షనల్‌ సామర్థ్యం పెరగడంతో మరిన్ని రైళ్లను నడిపించడానికి అవకాశాలు పెరుగుతాయి. విద్యుదీకరణ పనుల నిర్వహణలో అంకితభావంతో శ్రమించిన జోన్‌ సిబ్బంది, అధికారుల బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) శ్రీ అరుణ్‌ కుమార్‌ జైన్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Also Read

Anand Mahindra: సంకల్పం, చాతుర్యం, సహనం ఉంటే విజయం మీ సొంతం.. ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న వీడియో వైరల్

వలకు చేప పడిందనుకున్నారు కానీ.. ఒడ్డు తెచ్చి చూసి షాక్‌ అయ్యారు !!

ముఖంపై ముడతలు పడుతున్నాయా ?? అయితే ఇలా చేయండి..