హైదరాబాద్ మహా నగరంలో అత్యంత చవక ధరలకు రాకపోకలు సాగించేందుకు ప్రజల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు పూర్తి స్థాయిలో సేవలు అందించలేకపోతున్నాయి. గత కొన్ని రోజులుగా సర్వీసులను రద్దు చేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో శని, ఆదివారాల్లో రద్దు చేస్తే.. ఇప్పుడు పనిదినాల్లో కూడా రద్దు చేస్తూ, నగర ప్రయాణికులకు తక్కువ టిక్కెట్ ధరతో ఎక్కువ దూరం ప్రయాణించే వెసులుబాటును దూరం చేస్తోంది. సోమవారం 19 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసింది.
లింగంపల్లి నుంచి హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించేవి 2, హైదరాబాద్ నుంచి లింగంపల్లి వెళ్లేవి 3, ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వెళ్లేవి 5, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లేవి 6, రామచంద్రాపురం – ఫలక్‌నుమా మధ్య 2, ఫలక్‌నుమా నుంచి హైదరాబాద్ వెళ్లే 1 సర్వీసును రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటన జారీ చేసింది. అయితే.. దక్షిణ మధ్య రైల్వే తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. రద్దీగా ఉన్న సమయంలో అదనంగా రైళ్లు ఏర్పాటు చేయకుండా ఉన్నవాటినే రద్దు చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..