Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరే పలు రైళ్ల స్టేషన్ల మార్పు.. పూర్తి వివరాలివే..

సికింద్రాబాద్ నుంచి రైలు ప్రయాణం చేసే వారికి బిగ్ అలర్ట్. ఈ స్టేషన్ నుంచి బయలుదేరాల్సిన పలు రైళ్లను దక్షిణమధ్య రైల్వే ఇతర స్టేషన్లకు మార్చింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో అభివృద్ధి పనులు జరుగుతుండడంతో పలు రైళ్లను ఇతర స్టేషన్ల నుంచి స్టార్ట్ అవుతాయని తెలిపింది.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరే పలు రైళ్ల స్టేషన్ల మార్పు.. పూర్తి వివరాలివే..
Secunderabad Railway Station

Updated on: Aug 21, 2025 | 7:40 AM

తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలంటే ఏకైక మార్గం రైలు ప్రయాణం. రైలులో అతి తక్కు ధరతో దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. అందుకే రైలు ప్రయాణానికి ఫుల్ డిమాండ్. పండగలు వచ్చాయంటే ఆ రద్దీయే వేరు. నెలల ముందు టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైల్వే రోజు లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతుంది. ఇక తెలంగాణలో సికింద్రాబాద్‌ను ప్రధాన రైల్వే స్టేషన్‌గా చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. అందుకే ఈ స్టేషన్ ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ఏళ్ల క్రిత నాటి ఈ స్టేషన్‌లో ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంతో ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని రైళ్లను సికింద్రాబాద్‌కు బదులుగా ఇతర స్టేషన్ల నుంచి నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అక్టోబరు 20 నుంచి 26 వరకు పలు రైళ్ల రాకపోకలను మార్చారు.

ఈ రైలు అక్కడి నుంచి..

సికింద్రాబాద్- పోర్‌బందర్‌ రైలును ఉందానగర్ స్టేషన్‌ నుంచి నడపనున్నారు.

సిద్దిపేట-సికింద్రాబాద్ రైలు మల్కాజిగిరి నుంచి బయలుదేరుతుంది.

పుణే- సికింద్రాబాద్ రైలు నాంపల్లి స్టేషన్‌ నుంచి బయలుదేరుతుంది.

చర్లపల్లికి మార్చిన రైళ్లు:

సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన మరికొన్ని రైళ్లను చర్లపల్లి స్టేషన్‌కు మార్చారు. ఈ రైళ్లు అక్కడి నుంచి  స్టార్ట్ అవుతాయి.

సికింద్రాబాద్ – మణుగూరు

సికింద్రాబాద్ – రేపల్లె

సికింద్రాబాద్ – సిల్చార్‌

సికింద్రాబాద్ – దర్భంగా

సికింద్రాబాద్ – యశ్వంత్ పూర్

సికింద్రాబాద్ – అగర్తలా

సికింద్రాబాద్ – ముజఫర్‌పూర్

సికింద్రాబాద్ – సంత్రగచ్చి

సికింద్రాబాద్ – దానాపూర్

సికింద్రాబాద్ – రామేశ్వరం

ప్రయాణికులు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణ ప్రణాళికలు రూపొందించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. తాజా సమాచారం కోసం రైల్వే వెబ్‌సైట్‌ లేదా యాప్‌లను చూసుకోవాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..