Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. ఫలక్‌నుమా వైపు వెళ్లే పలు రైళ్లు పాక్షికంగా రద్దు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

 Hyderabad: ఫలక్‌నుమా స్టేషన్‌లో ట్రాక్‌ల పునరుద్ధరణ పనుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రోజూ సికింద్రాబాద్‌ ,..

Hyderabad: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. ఫలక్‌నుమా వైపు వెళ్లే పలు రైళ్లు పాక్షికంగా రద్దు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
South Central Railway
Follow us
Surya Kala

|

Updated on: Jan 09, 2022 | 8:05 AM

Hyderabad: ఫలక్‌నుమా స్టేషన్‌లో ట్రాక్‌ల పునరుద్ధరణ పనుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రోజూ సికింద్రాబాద్‌ , కాచిగూడ నుంచి బయలుదేరే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ఫలక్‌నుమా స్టేషన్‌లో ట్రాక్ పునరుద్ధరణ పనులను సులభతరం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే ట్రాఫిక్‌ను నిలిపివేసింది.

ఫలక్‌నుమా నుండి లింగంపల్లి వెళ్లే  రైలు నంబర్లు 47157 (), 47176 , 47165  రైళ్లు ఈ నెల 9వ తేదీ , 15, 16, 22 , 23 తేదీల్లో రద్దు చేయబడ్డాయి.

కాచిగూడ నుంచి ఫలక్‌నుమా వరకూ ప్రయాణించే .. ఇంగం పల్లి నుండి ఫలక్‌నుమా వెళ్లే రైలు నంబర్లు 47212 తో పాటు..  ఫలక్‌నుమా నుండి లింగంపల్లి వెళ్లే 47214 రైలు జనవరి 9, 15, 16, 22 , 23 తేదీలలో పాక్షికంగా రద్దు చేయబడ్డాయి.

సికింద్రాబాద్ నుండి ఉమ్దానగర్ ప్రయాణించే రైలు నంబర్లు 07055,  మేడ్చల్ నుండి ఉమ్దానగర్ ప్రయాణించే  07075 నెంబర్ రైలు జనవరి 9, 16 , 23 తేదీలలో పాక్షికంగా రద్దు చేయబడ్డాయని దక్షిణ మధ్య రైల్వే సంస్థ అధికారులు ప్రకటించారు.

Also Read:

ఈ వారంలో వ్యవసాయదారులకు లాభసాటిగా ఉంటుంది.. ఏఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

గుడ్‌న్యూస్.. కోవాక్సిన్ బూస్టర్‌ డోస్‌తో మంచి ఫలితాలు.. 90 శాతం మందిలో..