Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఏం పోయేకాలం వచ్చిందిరా.. రాశిగా పోసిన మిర్చికి మంట పెట్టారు..

Telangana: ఏం పోయేకాలం వచ్చిందిరా.. రాశిగా పోసిన మిర్చికి మంట పెట్టారు..

N Narayana Rao

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 10, 2025 | 1:45 PM

ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. కళ్ల ముందే ఆహుతి అయ్యింది.. కన్న బిడ్డను కోల్పోతే...తండ్రి ఎలా కన్నీరు పెడతారో.. ఆ రైతు అలా కన్నీరు మున్నీరుగా విలపించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావుపేటలో దారుణం జరిగింది ..కళ్లంలో ఆరబెట్టిన మిర్చిని గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు.  సుమారు 70 క్వింటాల మిర్చి మంటలకు దగ్ధం అయింది.  పది లక్షల ఆస్తి నష్టం జరిగింది. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావుపేటలో కళ్లంలో ఆరబెట్టిన మిర్చిని తగలబెట్టారు గుర్తుతెలియని దుండగులు. ఈ ఘటనలో సుమారు 70 క్వింటాల మిర్చి దగ్ధమైనట్లు రైతు పురుషోత్తం చెప్తున్నారు.  ఇది ఎవరు చేశారో.. ఎందుకు చేశారో తెలియదని, ఆరుగాలం కష్టపడి పండించిన పంట అగ్నికి ఆహుతి అయిందని రైతు పురుషోత్తం కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం.. సుమారు 11 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు రైతు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. భారీగా మిర్చి దగ్ధం అవడంతో ఆ ఘాటుకి ఊర్లో జనం కొన్ని గంటల పాటు అతలాకుతులమయ్యారు. దేశానికి అన్నం పెట్టే రైతును ఇలా చేయడం ఏంటి..ఎవరు చేశారో ఆ దుండగులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.   

Published on: Mar 10, 2025 01:44 PM