AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: రష్మికకు అండగా నిలిచింది కొడవ సామాజికవర్గం

నేషనల్ క్రష్ రష్మిక మందన్నపై వచ్చిన కొన్ని వ్యాఖ్యలు, విమర్శలు వివాదాస్పదంగా మారాయి. రష్మికకు గుణపాఠం చెప్పాలి అంటూ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే నిరంతరం విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా రష్మికకు అండగా నిలిచింది కొడవ సామాజికవర్గం.. రష్మిక మందన్నకు తగిన భద్రత కల్పించాలని కోరుతూ కొడవ జాతీయ మండలి అధ్యక్షుడు ఎన్‌యు నాచప్ప కేంద్రం, రాష్ట్రాలకు లేఖ రాశారు.

Rashmika Mandanna: రష్మికకు అండగా నిలిచింది కొడవ సామాజికవర్గం
Rashmika Mandanna
Ram Naramaneni
|

Updated on: Mar 10, 2025 | 2:30 PM

Share

కొడవ హక్కుల పరిరక్షణ సంస్థ…  కొడవ నేషనల్ కౌన్సిల్ (CNC) నటి రష్మిక మందన్న భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.  కొనసాగుతున్న రాజకీయ వివాదాల మధ్య ఆమెకు భద్రత కల్పించాలని కేంద్ర, కర్ణాటక హోం మంత్రులను కోరింది.  నటి రష్మిక మందన్న కర్ణాటకలోని కొడవ కమ్యూనిటీకి చెందినవారు. ఆమె బేస్ కొడగు ప్రాంతం. ఆమె కొడవ వారసత్వం కారణంగా నటిని అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నారని CNC ఆరోపించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ నటిపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో CNC ఈ అభ్యర్థన చేసింది.

రష్మిక కృషి, ప్రతిభతో గొప్ప పేరు తెచ్చుకుంది. కొందరు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని.. ఆమెను అనవసరమైన రాజకీయ చర్చల్లోకి లాగుతున్నారని CNC అధ్యక్షుడు నందినేర్వండ నాచప్ప ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఆమె ఎదుగుదలకు..  రాజకీయాలతో సంబంధం లేదని.. ఆమెను రాజకీయ నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కొందరు వ్యక్తులు, కళాత్మక స్వేచ్ఛ గురించి తెలియక, ఆమెను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.

కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గనిగ.. రష్మిక కన్నడ చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేసి బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి హాజరు కావడానికి నిరాకరించారని ఆరోపిస్తున్నారు. ఆమె 2010లో కన్నడ చిత్రం కిరిక్ పార్టీలో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిందని.. కానీ ఇప్పుడు ఎన్ని ఆహ్వానాలు ఇస్తున్నా ఆమె కర్ణాటకను సందర్శించడానికి నిరాకరిస్తుందని చెబుతున్నారు. రష్మికను ఒక కార్యక్రమానికి ఆహ్వానిస్తే కర్నాటక ఎక్కడ ఉందని అడిగిందని, ఆమెకు సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రష్మికపై ఎమ్మెల్యే రవి విమర్శల నేపథ్యంతో వెంటనే భద్రత కల్పించాలని కోరారు నాచప్ప.

రష్మిక ఇప్పటివరకు ఈ వివాదంపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఆమెకు మద్దతుగా అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.