ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన సోనూ సూద్ శంషాబాద్ విమానాశ్రయంలోని స్వర్ణిమ్ కౌంటర్‌ను సందర్శించారు. దివ్వాంగులు, శిశువులతో ఉన్న మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వర్ణిమ్ సేవలు బాగున్నాయని ఆయన కితాబునిచ్చారు. స్వచ్చంద సంస్థ సహకారంతో సీఐఎస్‌ఎఫ్ స్వర్ణిమ్ పేరుతో దివ్వాంగులకు, మహిళలకు ప్రత్యేక సేవలను అందించడం అభినందనీయమన్నారు. అనంతరం సీఐఎస్‌ఎఫ్ అందిస్తున్న ఈ ప్రత్యేక సేవలు బాగున్నాయంటూ అక్కడ ఉన్న పుస్తకంలో లిఖిత పూర్వకంగా వెల్లడించారు. కాగా, ఆపదలో ఉన్నామని ఎవరు అన్నా నేనున్నా అంటూ అందరికి సాయం చేస్తున్నాడు సోనూసూద్. ఆయనను ప్రజలు రియల్ హీరో అని ప్రశంసిస్తున్నారు.
Also Read: AP EAMCET: ముగిసిన ఏపీ ఎంసెట్ – 2020 తొలివిడత సీట్ల భర్తీ.. కంప్యూటర్ సైన్స్ అగ్రస్థానం..