AP EAMCET: ముగిసిన ఏపీ ఎంసెట్ – 2020 తొలివిడత సీట్ల భర్తీ.. కంప్యూటర్‌ సైన్స్‌ అగ్రస్థానం..

AP EAMCET Allotment Result: ఇంజనీరింగ్‌, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఎంసెట్‌-2020 తొలివిడత సీట్ల భర్తీ పూర్తయింది.

AP EAMCET: ముగిసిన ఏపీ ఎంసెట్ - 2020 తొలివిడత  సీట్ల భర్తీ.. కంప్యూటర్‌ సైన్స్‌ అగ్రస్థానం..
Follow us

|

Updated on: Jan 04, 2021 | 9:42 AM

AP EAMCET Allotment Result: ఇంజనీరింగ్‌, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఎంసెట్‌-2020 తొలివిడత సీట్ల భర్తీ పూర్తయింది. ఇందులో భాగంగా మొత్తం 72,867 సీట్లను భర్తీ చేశారు. 2020 ఎంసెట్‌ పరీక్షలో 1,29,714 మంది అర్హత సాధించగా 90,076 మంది కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో 89,078 మంది సర్టిఫికేట్లు వెరిఫికేషన్‌ చేయుంచుకోగా, 83,014 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చారు. వీటిలో ప్రస్తుతానికి 72,867 మంది సీట్లు భర్తీకాగా ఇంకా 30,899 సీట్లు మిగిలి ఉన్నాయి. ఈసారి 54 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇక ఏపీ ఎంసెట్‌-2020 తొలి విడుత సీట్ల కేటాయింపులో అత్యధిక సీట్లు కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలోనే భర్తీ కావడం విశేషం. గతంలోనూ కంప్యూటర్‌ సైన్స్‌లోనే ఎక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. దీని తర్వాత స్థానాల్లో ఐటీ, ఈసీఈ బ్రాంచ్‌లున్నాయి.

ఫలితాలు ఎలా తెలుసుకోవాలంటే..

సీట్ల భర్తీ వివరాలను తెలుసుకోవాలంటే ముందుగా ఏపీ ఎంసెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ apeamcet.nic.inలోకి వెళ్లాలి. అనంతరం ‘క్యాండిడేట్‌లాగిన్‌’ లింక్‌ను క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత లాగిన్‌ వివరాలను (లాగిన్‌ ఐడీ, హాల్‌ టికెట్‌, పాస్‌వర్డ్‌, పుట్టిన తేది వివరాలు) ఇచ్చి సబ్‌మిట్‌ బటన్‌ను నొక్కాలి. వెంటనే అభ్యర్థి ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.

Also Read: Fire Accident: నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం.. అధికారులు అప్రమత్తం.. తప్పిన పెను ప్రమాదం..