నాన్నకు ప్రేమతో.. ఆ కొడుకులు ఏం చేశారంటే.. ఊహించని కానుక !!

| Edited By: Jyothi Gadda

Jul 26, 2024 | 1:58 PM

ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని నేలకొండపల్లి మండలం, భైరవునిపల్లి గ్రామానికి చెందిన గుండపునేని పరాంకుశరావు గత ఏడాది మృతి చెందగా అతని కుమారులు తమ తండ్రిపై ప్రేమను ఇలా చాటుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

నాన్నకు ప్రేమతో.. ఆ కొడుకులు ఏం చేశారంటే.. ఊహించని కానుక !!
Memory Of His Father
Follow us on

కన్న తల్లి, తండ్రులను వృద్ధాప్యంలో సాకేందుకు ఇష్టం లేక ఇంటి నుంచి వెల్లగొడుతున్న నేటి రోజుల్లో తమ తండ్రి జ్ఞాపకంగా కుమారులు సొంత ఊర్లో విగ్రహాన్ని ఏర్పాటు చేసి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నిత్యం ఆ తండ్రి విగ్రహం ఎదుల పూజలు చేస్తూ తమ ప్రేమ, భక్తిని చాటుకుంటున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని నేలకొండపల్లి మండలం, భైరవునిపల్లి గ్రామానికి చెందిన గుండపునేని పరాంకుశరావు గత ఏడాది మృతి చెందగా అతని కుమారులు తమ తండ్రిపై ప్రేమను ఇలా చాటుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

తండ్రి జ్ఞాపకంగా ఆయన కుమారులు గుండపునేని రాంచందరావు, గుండపునేని లక్ష్మణ్ రావు లు తండ్రికి నిలువెత్తు విగ్రహం తయారు చేయించారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తండ్రి పరాంకుశరావు సజీవంగా నిలిచి ఉన్నట్లుగా సహజత్వం ఉట్టిపడేలా నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించారు. ఆ విగ్రహాన్ని తమ పొలం వద్ద ప్రత్యేకంగా నిర్మించిన గదిలో ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కనే విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో అటు వైపుగా వెళ్లేవారు విగ్రహాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. కంటే ఇలాంటి కొడుకుల్ని కనాలంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు.

తండ్రిపై ఇంత ప్రేమను చూపుతున్న కుమారులను గ్రామస్తులు అభినందిస్తున్నారు. తల్లి, తండ్రులకు భోజనం పెట్టని పిల్లలు ఉన్న ఈ రోజుల్లో తండ్రి గుర్తుగా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పలువురి మన్ననలు పొందుతున్నారు. తండ్రి కుమారుల ప్రేమానురాగాలకు ప్రతీకగా ఈ విగ్రహం నిలుస్తోంది. ఈ విగ్రహాన్ని చూసినప్పుడల్లా తన తండ్రి ఆత్మ సజీవంగా ఉన్నట్లు అనుభూతి కలుగుతుందని కుమారులు రాంచందరావు, లక్ష్మణ్ రావు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..