అబ్బో.. పొంగిపోతున్న శ్రీశైలం రిజర్వాయర్.. చూసేందుకు రెండుకళ్లు చాలవంతే..

అబ్బో.. పొంగిపోతున్న శ్రీశైలం రిజర్వాయర్.. చూసేందుకు రెండుకళ్లు చాలవంతే..

J Y Nagi Reddy

| Edited By: Srikar T

Updated on: Jul 26, 2024 | 2:38 PM

శ్రీశైలం రిజర్వాయర్‎కి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. కృష్ణానది ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. ఏపీతోపాటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదనీరు వచ్చి చేరుతోంది. గడిచిన వారం, 10రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఆల్మట్టి నారాయణపూర్ జూరాల ప్రాజెక్టులు నిండిపోయి.. శ్రీశైలానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్ 100 టిఎంసిల మైలురాయిని దాటింది.

శ్రీశైలం రిజర్వాయర్‎కి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. కృష్ణానది ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. ఏపీతోపాటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదనీరు వచ్చి చేరుతోంది. గడిచిన వారం, 10రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఆల్మట్టి నారాయణపూర్ జూరాల ప్రాజెక్టులు నిండిపోయి.. శ్రీశైలానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్ 100 టిఎంసిల మైలురాయిని దాటింది. 215 టీఎంసీలకుగాను ఇప్పటికే వంద టీఎంసీలు చేరడం, వరద నీరు కారణంగా రోజుకు 20 టీఎంసీలు వరకు వరదనీరు వచ్చి చేరుతోంది. మరోవారం రోజుల్లో రిజర్వాయర్ నిండటం ఖాయంగా కనిపిస్తోంది. అటు తుంగభద్ర డ్యామ్ 28 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆర్డీఎస్ దగ్గర తుంగభద్ర ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండు రోజుల్లో కర్నూలు మీదుగా శ్రీశైలం చేరనుంది. అటు కృష్ణ, ఇటు తుంగభద్ర నదుల వరద ప్రవాహం శ్రీశైలం చేరుతుండటంతో తాగు, సాగు, విద్యుత్ కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు రైతులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..