AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రిని కర్కషంగా హతమార్చిన కొడుకు.. అసలు కారణం అదే..

రంగారెడ్డిలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణమైన హత్య జరిగింది. శనివారం ఓ వ్యక్తి తన తండ్రి, మామలను రాడ్‌తో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్తి తగాదాలే ఈ జంట హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. మృతులను లక్ష్మీనారాయణ (52), అతని బావ శ్రీనివాసులుగా గుర్తించారు.

తండ్రిని కర్కషంగా హతమార్చిన కొడుకు.. అసలు కారణం అదే..
Son Kills His Father
Srikar T
|

Updated on: Jan 28, 2024 | 8:27 PM

Share

రంగారెడ్డిలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణమైన హత్య జరిగింది. శనివారం ఓ వ్యక్తి తన తండ్రి, మామలను రాడ్‌తో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్తి తగాదాలే ఈ జంట హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. మృతులను లక్ష్మీనారాయణ (52), అతని బావ శ్రీనివాసులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీని గురించి తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు రాకేష్‌ను పట్టుకున్నారు. మైలార్‌దేవ్‌పల్లిలోని లక్ష్మీనారాయణ కుటుంబం మొదట తమ ఇంటిని రూ.53 లక్షలకు విక్రయించాలని నిర్ణయించగా, అందులో రూ.20 లక్షలు లక్ష్మీనారాయణ తన వద్దే ఉంచుకుంటారని తెలిపారు.

దీంతో విషయం తేల్చేందుకు మంత్రాలయం నుంచి సోదరి, బావమరిది శ్రీనివాసులును పిలిచాడు. ఈ విషయంపై, వాగ్వాదం జరగడంతో, లక్ష్మీనారాయణ చిన్న కుమారుడు, 24 ఏళ్ల రాకేష్, తన తండ్రిని రోడ్డుపైకి లాగి, రాడ్‌తో కొట్టాడు. అతని మామ శ్రీనివాసులు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా, అతనిపై కూడా అదే రాడ్‌తో దాడి చేశారు అని పోలీసు అధికారి తెలిపారు. వారిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా అప్పటికే గాయాలతో తీవ్ర రక్తస్రావం జరిగి మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసు అధికారి తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..