ఓ ఆలయంలో నాగు పాము ప్రత్యక్షమైంది. గుడిలోపల ఉన్న దేవత విగ్రహంపై నాగు పాము దర్శనమిచ్చింది. ఆలయంలో నాగు పాము రావడంతో భక్తులు దానికి పూజలు చేశారు. హారతి ఇచ్చి గంటపాటు పూజలు చేసినా.. ఆ పాము అక్కడ్నుంచి కదల్లేదు. దీంతో ఇదంతా దేవుని మహాత్యం అని కొలుస్తున్నారు అక్కడి స్థానికులు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం సాలెబంజర పంచాయతీ పరిధిలోని జంపాలనగర్ తండాలో ఈ అద్బుత ఘటన వెలుగు చూసింది. గిరిజన దేవత మంగ్తూసాథ్ దేవాలయంలోనికి ఓ పాము వచ్చి దేవత విగ్రహంపై అమర్చిన ఇత్తడి తొడుగుల పైకి చేరింది. అక్కడ పూజలు చేసేందుకు వచ్చిన స్థానికులను చూసి పడగ విప్పి ఆడింది. పూజారి సుమారు గంట పాటుపూజలు చేసి హారతి ఇచ్చినా పాము అక్కడి నుంచి కదలలేదు. దీంతో దేవుని పాము అంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని పసుపు కుంకుమ వేసి హారతులు ఇచ్చి పూజలు చేశారు. ఆలయంలో నాగు పాము రావడంతో భక్తులు విశేష పూజలు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆలయంలో పాముకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.
కాగా ఇటీవల ఖమ్మం జిల్లాలోనే శ్రీరాముని విగ్రహం కళ్ళవెంట నీళ్లు కారుతున్న ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన కూడా జిల్లాలో స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకటయి తండా లోని రామాలయం లో ఉన్న రాముడు విగ్రహం కళ్ళనుండి నీళ్లు కారుతున్నాయి అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రజలు చాలా మంది దీనిని వింతగా చూడగా, తండా గ్రామస్తులు మాత్రం ఇది అరిష్టమని భారీ ఎత్తిన పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే.
Also Read: అడ్డెడ్డె, బంగారం ఇంత చవకా..? ఆశపడి కొన్నారో కొంప కొల్లేరే