లొంగిపోతారా..? లేపేయమంటారా..తాజా ఎన్ కౌంటర్ అర్థం ఇదేనా..?

దండకారణ్యం దద్దరిల్లుతోంది. మావోయిస్టుల కంచుకోట అబూజ్‌మడ్‌లోకి చొచ్చుకెళ్లిన పోలీసులు..పలువురిని ఎన్‌కౌంటర్‌ చేశారు. దండకారణ్యంలో తమకు తిరుగులేదనుకున్న మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా బలగాలు కూంబింగ్‌ ఆపరేషన్‌ కంటిన్యూ చేస్తోంది. దాంతో మావోయిస్టులు తెలంగాణవైపు వస్తుండటంతో పోలీసులు అలెర్టయ్యారు.

లొంగిపోతారా..? లేపేయమంటారా..తాజా ఎన్ కౌంటర్ అర్థం ఇదేనా..?
Maoist Encounter Kothagudem Dist

Edited By: Ravi Panangapalli

Updated on: Sep 06, 2024 | 5:11 PM

దండకారణ్యం దద్దరిల్లుతోంది. మావోయిస్టుల కంచుకోట అబూజ్‌మడ్‌లోకి చొచ్చుకెళ్లిన పోలీసులు..పలువురిని ఎన్‌కౌంటర్‌ చేశారు. దండకారణ్యంలో తమకు తిరుగులేదనుకున్న మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా బలగాలు కూంబింగ్‌ ఆపరేషన్‌ కంటిన్యూ చేస్తోంది. దాంతో మావోయిస్టులు తెలంగాణవైపు వస్తుండటంతో పోలీసులు అలెర్టయ్యారు. భద్రాద్రికొత్తగూడెంజిల్లా రఘునాథపాలెంకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫారెస్టులో మొన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు దళ సభ్యులు మృతి చెందారు. వీరందరు పాల్వంచ దళానికి చెందిన మావోయిస్టులు. 15 సంవత్సరాల తర్వాత తెలంగాణలో జరిగిన ఈ భారీ ఎన్‌కౌంటర్ సంచలనంగా మారింది ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతానికి సాహోసోపేతంగా టీవీ9 బృందం చేరుకుంది. టీవీ9 బ్యూరో చీఫ్ విజయ్, కెమెరామెన్ వెంకట్ అసలు ఏం జరిగిందనే దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ మరిచిపోకముందే..తాజాగా తెలంగాణలో జరిగిన ఈ ఘటన మావోయిస్టుల ఉనికిని చాటుతోంది. కేంద్రం ప్రభుత్వం- ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం మావోయిస్టులను తీవ్ర ఇబ్బందిపెడుతోంది. దాంతో తెలంగాణవైపు మావోయిస్టులు తరలివస్తున్నారు. 2014లో శృతి, విద్యాసాగర్‌ ఎన్‌కౌంటరే అతిపెద్దది. అయితే పదేళ్ల తర్వాత తెలంగాణలో ఏకంగా ఒక దళాన్నే ఎన్‌కౌంటర్‌ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయుధాలతో మావోయిస్టులు తెలంగాణలో అడుగుపెడితే సహించేది లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌ మావోయిస్టులకు కంచుకోట. కొన్నేళ్లుగా దుర్భేద్యమైన ఈ ప్రదేశాన్ని స్థావరంగా చేసుకొని మావోయిస్టులు రెచ్చిపోయారు. అబూజ్‌మడ్‌పై నజర్‌ పెట్టిన భద్రతా బలగాలు ఆ ప్రాంతంలోకి చొచ్చుకుపోయి పలువురిని ఎన్‌కౌంటర్‌ చేసి వారికి...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి