Agnipath Scheme Protest: సాధారణ స్థితికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. యధావిధిగా పరుగులు తీస్తున్న రైళ్లు..

| Edited By: Team Veegam

Jun 18, 2022 | 11:40 AM

Agnipath Scheme Protest: రోజంతా ఆందోళనలతో అట్టుడికిన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నార్మల్‌ పరిస్థితికి చేరుకుంది. పరిస్థితి అదుపులోకి రావడంతో స్టేషన్‌

Agnipath Scheme Protest: సాధారణ స్థితికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. యధావిధిగా పరుగులు తీస్తున్న రైళ్లు..
Secunderabad Railway
Follow us on

Agnipath Scheme Protest: రోజంతా ఆందోళనలతో అట్టుడికిన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నార్మల్‌ పరిస్థితికి చేరుకుంది. పరిస్థితి అదుపులోకి రావడంతో స్టేషన్‌ పరిసరాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్​నుంచి తరలించారు. రాత్రి 7 గంటలకు స్టేషన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. రైల్వే అధికారులకు రైళ్లను పునరుద్దరించారు. దాదాపు 9 గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచి పోయాయి. పరిస్థితులు సద్దుమణగడంతో రైల్వే అధికారులు షెడ్యూల్‌ రైళ్లను తిరిగి ప్రారంభించారు. మొదట.. కాకినాడ వెళ్లే రైలు ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌ నుంచి బయలు దేరింది. అటు.. మరోసారి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా స్టేషన్​ ప్రాంగణంలో పోలీసులు, సీఆర్పీఎఫ్​, ఆర్​పీఎఫ్​ బలగాలను భారీగా మోహరించారు. మళ్లీ అసాధారణ పరిస్థితులు తలెత్తకుండా పోలీసు అధికారులు భారీగా మోహరించారు. ఆందోళనకారులకు స్టేషన్​ నుంచి బయటకి తరలించారు. దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.