TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ కేసులో మరో సంచలనం.. ఎలక్ట్రానిక్‌ డివైజ్‌తో పరీక్ష రాసిన నిందితుల అరెస్ట్‌

|

May 29, 2023 | 8:17 PM

TSPSC కేసులో రోజుకో సంచలనం చోటు చేసుకుంటోంది. ఇప్పటికే ఎగ్జామ్‌ పేపర్ల లీక్‌ కేసులో కీలక విషయాలు వెల్లడి కాగా తాజాగా మరొక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే నిందితులు ఎలక్ట్రానిక్‌ డివైజ్‌తో పరీక్ష రాసినట్లు తేల్చిన అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు సిట్‌ అధికారులు.

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ కేసులో మరో సంచలనం.. ఎలక్ట్రానిక్‌ డివైజ్‌తో పరీక్ష రాసిన నిందితుల అరెస్ట్‌
Tspsc
Follow us on

TSPSC కేసులో రోజుకో సంచలనం చోటు చేసుకుంటోంది. ఇప్పటికే ఎగ్జామ్‌ పేపర్ల లీక్‌ కేసులో కీలక విషయాలు వెల్లడి కాగా తాజాగా మరొక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే నిందితులు ఎలక్ట్రానిక్‌ డివైజ్‌తో పరీక్ష రాసినట్లు తేల్చిన అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు సిట్‌ అధికారులు. నిందితులు ప్రశాంత్‌, మహేశ్‌, నవీన్‌లను అరెస్ట్‌ చేసింది. వీరు రమేష్‌ ద్వారా AEE పేపర్ పొందినట్లు విచారణలో తేలింది. కాగా TSPSCలో ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేశాడు. ఇప్పటికే ఈ కేసులో రమేష్‌ను అరెస్ట్ చేసింది సిట్‌. కాగా రమేష్‌ ఆన్సర్లు చెప్తుంటే.. నిందితులు బ్లూటూత్‌లో విని ఆన్సర్లు రాసినట్టు సిట్‌ గుర్తించింది. కాగా కట్టుదిట్టంగా నిర్వహించే పరీక్ష హాల్‌లోకి ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు ఎలా వెళ్లాయనే దానిపై సీరియస్‌గా దృష్టి పెట్టింది సిట్. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన AEE పేపర్‌ లీక్‌లో ఇప్పటివరకు 43 మంది అరెస్ట్‌ అయ్యారు. కాగా పేపర్‌ లీక్‌ ఒకవైపు.. ఎగ్జామ్‌ హాల్‌లోకి ఎలక్ట్రానిక్ డివైజ్‌లు రావడం మరోవైపు.. మొత్తానికి పరీక్ష పేపర్ల లీక్‌ వ్యవహారం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. ఈ పేపర్‌ ఇలా ఇంకా ఎవరెవరికి చేరింది అనే దానిపై మరింత లోతుగా విచారణ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

 

కాగా టీఎస్పీయస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏఈ పరీక్షలో టాపర్‌గా నిలిచిన అభ్యర్థి ఏ ప్లస్‌ బీ హోల్‌ స్క్వేర్‌ అంటే ఏమిటో చెప్పలేక తెల్లమొహం వేశాడు. స్కూల్‌ విద్యార్ధులు కూడా ఠక్కున చెప్పే ఈ సూత్రాన్ని అతగాడు చెప్పలేకపోయాడు. గణితం, చరిత్ర, రాజనీతి, ఆర్థికశాస్త్రం అంశాలపై పట్టు సాధించకున్నా అడ్డదారిలో కొనుగోలు చేసిన ప్రశ్నపత్రాలతో పోటీ పరీక్షల్లో టాప్‌ మార్కుల్లో నెగ్గాడు. ప్రశ్నాపత్రాల లీకేజీలో భాగంగా గ్రూప్‌ 1, ఏఈ, ఏఈఈ, డీఏవో తదితర పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన వారిని సిట్‌ అధికారులు వేర్వేరుగా విచారించారు. వారు చెప్పే జవాబుల ఆధారంగా ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసి పరీక్ష రాసిన వారిని గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..