సంధ్య.. సమత.. మధ్యలో మహేందర్.. నిజం తెలిసేలోపే ఇద్దరినీ ట్రాప్ చేశాడు.. చివరకు..

ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో సంధ్య ఐడీ పేరుతో ఓ యువతితో స్నేహం చేశాడు.. ఆ తర్వాత.. తాను అబ్బాయినని పరిచయం చేసుకుని పెళ్లి కాలేదని నమ్మించాడు.. మనది ఒకటే కులం అంటూ నమ్మించాడు.. ఆ తర్వాత.. ఆమెతో ప్రేమాయాణం సాగిస్తూనే.. తన అక్కతో కూడా పరిచయం పెంచుకున్నాడు.. ఈ క్రమంలోనే.. తాను ముందు ప్రేమించిన యువతికి వివాహం కాకుండా అడ్డుపడటంతో.. అక్కా చెల్లెల్లు ఇద్దరూ పథకం ప్రకార.. అతన్ని చంపారు.. యువకున్ని దారుణంగా హత్య చేసిన సంఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది.

సంధ్య.. సమత.. మధ్యలో మహేందర్.. నిజం తెలిసేలోపే ఇద్దరినీ ట్రాప్ చేశాడు.. చివరకు..
Karimnagar Crime News

Edited By:

Updated on: Jan 01, 2026 | 9:44 AM

పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట గ్రామానికి చెందిన బుర్ర మహేందర్‌గౌడ్‌ (33) జగిత్యాల పట్టణంలోని శంకులపల్లి ప్రాంతానికి చెందిన బైరవేని సమతకు ఇన్‌స్టాగ్రామ్‌లో సంధ్య ఐడీ పేరుతో స్నేహం చేశాడు. దీంతో ఆ స్నేహం తర్వాత తను అబ్బాయి అని తెలియడంతో సమతకు తమది ఒకటే కులమని, తనకు పెళ్లి కాలేదని నమ్మించాడు. దీంతో సమతకు తెలియకుండా తన సోదరి సంధ్య ఫోన్‌ను హ్యాక్‌ చేసి ఆమె మొబైల్‌ నంబరుకు లేడీస్‌ సారీస్‌ కలెక్షన్స్‌ అనే వాట్సప్‌ గ్రూప్‌లో యాడ్‌ చేశాడు. దీంతో సంధ్యతో కూడా మృతుడు తరుచూ మాట్లాడుతూ చాటింగ్‌ చేసేవాడు. ఈ నేపథ్యంలో మృతునికి వివాహం అయిందని తెలిసి సమత దూరంగా ఉంటుంది. దీంతో సమతకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని విషయం తెలుసుకుని వివాహం చేసుకోవద్దని, తననే పెళ్లి చేసుకోవాలని, లేకుంటే ఫోటోలు మార్ఫింగ్‌ చేసి పెళ్లి కొడుకుకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.

అంతేకాకుండా.. తన అక్క సంధ్య కూడా నాతో ఫోన్‌లో మాట్లాడుతుందని, ఆమె ఫొటోలు, మీ కుటుంబ సభ్యుల ఫోటోలు మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానని బెదిరించాడు. దీంతో వెంటనే సమత అక్క సంధ్యకు జరిగిన విషయం అంతా తెలిపింది. తనతో.. అక్కతో స్నేహం చేసింది ఒక్కడేనని ఇద్దరూ తెలుసుకున్నారు. దీంతో ఈ విషయాన్ని లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన మేనమామ నరేశ్‌కు సంధ్య, సమతలు తెలిపారు. దీంతో నరేశ్, సంధ్య కుమారుడు రాజశేఖర్, అతని ఇద్దరు మిత్రులతో కలిసి మహేందర్‌ను హత్య చేయాలని పథకం పన్నారు. దీంతో సంధ్యతో మహేందర్‌కు ఫోన్‌ చేయించి అతన్ని లక్ష్మీపూర్‌ గ్రామానికి రావాలని పిలిపించారు.

శుక్రవారం మృతుడు మహేందర్ గౌడ్ సంధ్యకు వాట్సప్‌ మెసేజ్‌ ద్వారా కలవడానికి వస్తానని చెప్పాడు. సంధ్య కూడా సరేనని చెప్పి మహేందర్‌ మళ్లీ మెసేజ్‌ చేసి రాత్రి 10–11 గంటలకు వస్తున్నానని మెసేజ్‌ చేశాడు. దానికి కూడా సంధ్య ఒకే అని చెప్పడంతో ముందుగానే అనుకున్న పథకం ప్రకారం సమతను వారి అమ్మమ్మ వారి ఇంట్లో ఉంచి నరేశ్‌కు చెందిన కారులో జగిత్యాల కొత్తబస్టాండ్‌కు వచ్చారు. వెనకాల స్కూటీపై సంధ్య కొడుకు రాజశేఖర్, అతని స్నేహితులు వచ్చారు. వెంటనే సంధ్య కారులోంచి దిగి స్కూటీ తీసుకుని మహేందర్‌ రాగానే రాత్రి 10 గంటల సమయంలో కొత్తబస్టాండ్‌ నుంచి స్కూటీపై ఎక్కించుకుని లక్ష్మీపూర్‌కు బయల్దేరారు. దీంతో వెనకాలే నరేశ్, రాజశేఖర్, అతని ఇద్దరు స్నేహితులు స్కూటీని ఫాలో అవుతూ కారులో వచ్చారు.

మహేందర్‌ ఇంట్లోకి చేరుకున్న కొద్దిసేపటికే నరేశ్, రాజశేఖర్, అతని ఇద్దరు స్నేహితులు కారు దిగి సంధ్య ఇంట్లోకి వెళ్తుండగా.. మహేందర్‌కు అనుమానం వచ్చి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే సంధ్య గేటు వద్ద ఉన్న మహేందర్‌ను పట్టుకోగా నరేశ్, రాజశేఖర్, మరో ఇద్దరు స్నేహితులు కొట్టి బెదిరించి ఫోన్‌ లాక్కున్నారు. ఈ నేపథ్యంలోనే సంధ్య ఇంట్లో ఉన్న కారంపొడిని తీసుకుని మహేందర్‌పై చల్లింది. దీంతో అప్పటికే గాయాలైన మహేందర్‌ కింద పడిపోయాడు. అనంతరం కర్రలు, ఇనుపరాడ్‌తో రాజశేఖర్, అతని ఇద్దరు మిత్రులు దాడిచేశారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహేందర్‌ను జగిత్యాల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

మృతుని తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను ఆదివారం లక్ష్మీపూర్‌ గ్రామ శివారులో అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అయిన వారిలో లక్ష్మీపూర్‌కు చెందిన గర్వందుల సంధ్య, గర్వందుల రాజశేఖర్, గర్వందుల నరేశ్, శంకులపల్లికి చెందిన బైరవేని సమతలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. దీంతో పాటు, వారి వద్ద నుంచి స్కోడా కారు, స్కూటీ, ఇనుపరాడ్, కర్ర, ఐదు మొబైల్‌ఫోన్లు స్వాదీనం చేసుకున్నట్ల తెలిపారు. కాగా, హత్య కేసులో ఉన్న నలుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..