AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddipet Election Result 2023: సిద్దిపేట మళ్లీ జయకేతనం ఎగరేసిన హరీష్

Siddipet Assembly Election Result 2023 Live Counting Updates: 2019లో సిద్దిపేట నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మళ్లి బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి పూజల హరికృష్ణ, బీజేపీ నుంచి డూడీ శ్రీకాంత్ రెడ్డి ఎన్నికల సంగ్రామంలో నిలిచారు. అభ్యర్థలందరూ తీవ్రంగా ప్రచారం చేశారు.  కానీ భారీ మెజార్టీతో గెలుపొందారు హరీష్.

Siddipet Election Result 2023: సిద్దిపేట మళ్లీ జయకేతనం ఎగరేసిన హరీష్
Harish Rao
Ram Naramaneni
|

Updated on: Dec 03, 2023 | 6:53 PM

Share

సిద్దిపేటలో మరోసారి గెలపు జెండా ఎగరేశారు హరీశ్ రావు. 82308 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పూజల హరికృష్ణకు 23206 ఓట్లు పోలవ్వగా.. బీఆర్‌ఎస్ క్యాండిడేట్‌ శ్రీకాంత్ రెడ్డికి 23201 ఓట్లు పోలయ్యాయి. బీఎస్పీ అభ్యర్థికి కూడా 16 వేల పైచిలుకు ఓట్లు పడ్డాయి.

2019లో సిద్దిపేట (Siddipet Assembly Election) నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మళ్లి బరిలోకి దిగారు హరీశ్ రావు. కాంగ్రెస్ నుంచి పూజల హరికృష్ణ, బీజేపీ నుంచి డూడీ శ్రీకాంత్ రెడ్డి ఎన్నికల సంగ్రామంలో నిలిచారు. అభ్యర్థలందరూ తీవ్రంగా ప్రచారం చేశారు.  మాజీ మంత్రి హరీష్‌ రావుకు సిద్దిపేటలో అసాధారణ ప్రజాధారణ ఉంది. 2018 ఎన్నికల్లో హరీష్‌రావుకు 118699 ఓట్ల రికార్డు మెజార్టీ వచ్చిందనే ఆయన్ను అక్కడి జనం ఎలా చూస్తున్నారో అర్థమవుతుంది. 2018లో హరీష్‌ రావుకు 131295 ఓట్లు రాగా.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన శ్రీనివాసరెడ్డికి కేవలం 12596 ఓట్లు రావడంతో.. డిపాజిట్‌ గల్లంతు అయింది. బీజేపీ నుంచి అదృష్టాన్ని పరిశీలించుకున్న నాయిని నరోత్తం రెడ్డికి తీవ్ర నిరాశ ఎదురైంది. ఆయన నాలుగువేల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. 3 ఉప ఎన్నికలు, 3 సాధారణ ఎన్నికలు మొత్తం 6 సార్లు హరీష్ ఇక్కడి నుంచి గెలుపొందారు.  తెలంగాణ సాదనలో భాగంగా రెండుసార్లు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి, ఉప ఎన్నికలలో విజయ ఢంకా మోగించారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి హరీష్ మెజార్టీ పెరుగుతూ పోతుంది. కానీ ఈసారి మాత్రం కాస్త మెజార్టీ తగ్గింది.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్

హరీష్‌రావు సీఎం కేసీఆర్‌కు స్వయానా మేనల్లుడు అన్న విషయం తెలిసిందే. ఆయన వెలమ సామాజికవర్గానికి చెందినవారు. సిద్దిపేట నియోజకవర్గంలో 15 సార్లు వెలమ సామాజికవర్గం నేతలు విజయం సాధించారు. 1985 నుంచి 2004 వరకు ఈ నియోజకవర్గానికి కేసీఆర్ ప్రాతినిద్యం వహించగా, ఆ తర్వాతి కాలంలో హరీష్‌ రావు హరీష్ వరసగా గెలుస్తూ వస్తున్నారు.  2014లో తెలంగాణ వచ్చాక.. TRS అదికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్‌లో మంత్రి అయ్యారు హరీష్.  2018లో గెలిచిన వెంటనే  మినిస్టర్ పోస్ట్ రాలేదు. కొన్ని నెలల తర్వాత మంత్రి పదవి తిరిగి చేపట్టిన విషయం తెలిసిందే.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్