South Central Railway: భారీ వర్షాల ఎఫెక్ట్.. పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలివే..

|

Aug 01, 2021 | 9:38 PM

South Central Railway: భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.

South Central Railway: భారీ వర్షాల ఎఫెక్ట్.. పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలివే..
Trains
Follow us on

South Central Railway: భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అలాగే మరికొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ మేరకు ఎస్‌సిఆర్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె త్రిపాఠి పేరిట ప్రకటన విడుద లచేశారు. హౌరా, టికియాపాటా యార్డ్‌లలో నీరు నిలిచిపోవడంతో.. పలు రద్దు రైళ్లను మధ్యలోనే నిలిపివేసినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే.. ఆయా ప్రాంతాలకు వెళ్లే మరికొన్ని రైల్ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు.

ఈ ప్రకటన ప్రకారం..
1. 02543 నెంబర్ గల హౌరా-చెన్నై స్పెషల్ రైలు 01/08/2021 తేదీన హౌరా నుండి 15.30 గంటలకు బయలుదేరాలి. కానీ, హౌరా యార్డ్‌లో నిరు నిలిచిపోవడంతో అక్కడి నుంచి కాకుండా.. శాంట్రగాచి నుంచి 17.00 గంటలకు బయలుదేరుతుంది.
3. 02663 నెంబర్ గల హౌరా-తిరుచ్చిరాపల్లి స్పెషల్ ట్రైన్.. హౌరా నుండి 01/08/2021 తేదీన 17.35 గంటలకు బయలుదేరాలి. హౌరాలో నీరు నిలిచిపోవడం హౌరాకు బదులుగా శాలిమార్ స్టేషన్ నుంచి 18.35 గంటలకు బయలుదేరుతుంది.

తాత్కాలికంగా రద్దు చేయబడిన రైళ్ల వివరాలు..
1. 02704 సికింద్రాబాద్-హౌరా స్పెషల్ ట్రైన్
2. 02593 సాయినగర్ షిర్డీ-హౌరా స్పెషల్ ట్రైన్
3. 02874 యశ్వంతపూర్-హౌరా స్పెషల్ ట్రైన్
4. 02822 చెన్నై-హౌరా స్పెషల్ ట్రైన్
5. 02666 కన్యాకుమారి-హౌరా స్పెషల్ ట్రైన్

Also read:

AP Governor: ఈ ఏడాది కూడా పుట్టిన రోజు జరుపుకోకూడదని నిర్ణయించుకున్న ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్

PV Sindhu: కాంస్యం గెలిచిన సింధుకు యావత్ భారతం జేజేలు.. సింధు దేశానికి గర్వకారణం అంటున్న ప్రధాని

Vijayawada: విజయవాడలో నకిలీ పోలీసు హల్‌చల్.. విచారణలో వెలుగులోకి షాకింగ్ విషయాలు..