షర్మిలకు తల్లితోడు : కూతురికి సహకరించాలని వైఎస్‌కు దగ్గరగా పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు విజయమ్మ ఫోన్లు.!

|

Feb 20, 2021 | 12:55 PM

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు వైఎస్ షర్మిల సన్నాహాలను వేగవంతం చేశారు. వైఎస్‌ హయాంలో నిర్మించిన నీటి ప్రాజెక్ట్‌లు, వాటి పరిస్థితిపై షర్మిల అధ్యయనం..

షర్మిలకు తల్లితోడు : కూతురికి సహకరించాలని వైఎస్‌కు దగ్గరగా పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు విజయమ్మ ఫోన్లు.!
Follow us on

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు వైఎస్ షర్మిల సన్నాహాలను వేగవంతం చేశారు. వైఎస్‌ హయాంలో నిర్మించిన నీటి ప్రాజెక్ట్‌లు, వాటి పరిస్థితిపై షర్మిల అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణలో పెట్టబోయే తన కొత్త పార్టీ విధివిధానాలు ఏ రకంగా ఉండాలనే దానిపై కసరత్తు చేస్తున్నట్టు లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ నిర్మాణం కోసం సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలని షర్మిల నిర్ణయించారు. తండ్రి వైయస్‌ఆర్‌కు దగ్గరగా ఉన్న నేతలను, మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లతో మంతనాలు చేస్తున్నారు. ఇందుకోసం.. తల్లి విజయమ్మ సహకరం తీసుకుంటున్నారు. వైఎస్‌ఆర్‌ హయాంలో సీఎంఓలో పని చేసిన పలువురు సీనియర్ అధికారులకు ఫోన్ చేసి తన కూతురుకు సహకరించాలని విజయమ్మ కోరినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, షర్మిల తన కొత్త పార్టీని ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై మాత్రం ఇంకా ఓ క్లారిటీ రాలేదు. ఇక పార్టీ పెట్టే ముహూర్తంపైనా అంతర్గత చర్చలు నడుస్తునాయి. మే 14 లేదా జూలై 8న పార్టీ పేరు ప్రకటన చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 8న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి. ఆరోజు పార్టీ అనౌన్స్‌ చేయాలనే యోచనలో షర్మిల ఉన్నట్లు సమాచారం. ఇక మే 14న ప్రకటిస్తే బాగుంటుందని ముఖ్య నేతలు కొందరు ఆమెకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక, మార్చి 2వ తేదిన మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు షర్మిల. ఏప్రిల్‌ 10వరకు అన్ని జిల్లాల నాయకులతో ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతాయి. చివరిగా ఖమ్మం జిల్లా నేతలతో ఆత్మీయ సమ్మేళనం చేసి, ఆపై నేరుగా తెలంగాణ పొలిటికల్ అరంగేట్రం ఉంటుందని భావిస్తున్నారు.

Read also : తెలంగాణలో షర్మిల అడుగులపై సర్వత్రా ఆసక్తి, పక్కాప్లానింగ్‌తో వరుస భేటీలు.. జోరుగా కొత్త పార్టీ ఏర్పాటుకు గ్రౌండ్ వర్క్