Finger Print Scam: ఇది నెక్ట్స్ లెవల్ ఫోర్జరీ.. అసలు మ్యాటర్ తెలిసి పోలీసులు షాక్..!

| Edited By: Ravi Kiran

Jun 17, 2022 | 3:53 PM

Finger Print Scam: శతకోటి ఉపయోగాలు ఉపయోంగించి.. లక్షలు కాజేస్తున్న కేటుగాళ్ల గురించి రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కానీ ఈ ముఠా.. వాళ్లందరికి నెక్ట్స్ లెవల్.

Finger Print Scam: ఇది నెక్ట్స్ లెవల్ ఫోర్జరీ.. అసలు మ్యాటర్ తెలిసి పోలీసులు షాక్..!
Arrest
Follow us on

Finger Print Scam: శతకోటి ఉపయోగాలు ఉపయోంగించి.. లక్షలు కాజేస్తున్న కేటుగాళ్ల గురించి రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కానీ ఈ ముఠా.. వాళ్లందరికి నెక్ట్స్ లెవల్. అత్యంత కష్టసాధ్యమైన వేలిముద్రలను ఫోర్జరీ చేసి సొమ్ముకాజేస్తున్నారు. వాస్తవానికి వేలి ముద్రలు ఫోర్జరీ చేయడానికి కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతోనే.. ప్రభుత్వం ప్రతి దానికి బయోట్రిక్ విధానం ఉపయోగిస్తోంది. కానీ ఆ వేలి ముద్రలను కూడా ఫోర్జరీ చేస్తున్నాయి నకిలీ గ్యాంగ్స్. తాజాగా ఫేక్ వేలిముద్రలు రూపొందించి.. వాటి ద్వారా బయోమెట్రిక్ విధానంతో నగదు కాజేసిన ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు వేంకటేశ్‌తో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 3.4లక్షల నగదు, నకిలీ వేలిముద్రలు, బయోమెట్రిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగల వేంకటేష్.. కర్నూల్ లోని కలెక్టరేట్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేశాడు. రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్ నుంచి పలు డాక్యుమెంట్లను డౌన్ లోడ్ చేశాడు. వాటిలో ఉండే పలువురి పేర్లు, ఆధార్ కార్డు, వేలిముద్రలను సేకరించాడు. డాక్యుమెంట్లలోని వేలిముద్రల మాదిరిగానే నకిలీ రబ్బరు వేలి ముద్రలను తయారు చేయించాడు. ఆధార్ నెంబర్ ఆధారంగా పేమెంట్ చేసే విధానాన్ని ఉపయోగించుకొని నగదు విత్ డ్రా పెట్టేవాడు. బయోమెట్రిక్ మిషన్‌మీద నకిలీ రబ్బరు వేలిముద్రలను ఉంచి.. ఈజీగా సొమ్మును కాజేసి.. తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఇప్పటి వరకూ 149 మంది ఖాతాదారుల నుంచి నగదు మళ్లించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇవి కూడా చదవండి