Telangana BJP: ఒకే ఒక్క పోస్ట్‌తో జితేందర్‌రెడ్డి కలకలం.. అద్భుతమైన పోలిక అంటూ రేవంత్.. తెలంగాణ బీజేపీలో ట్వీట్ ఫైట్..
టీబీజేపీలో అసంతృప్తుల పర్వం కొనసాగుతోంది. నాయకత్వంపై చెలరేగిన చిచ్చు... సునామీలా మారుతోంది. తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతుందో ఒకే ఒక్క ట్వీట్‌తో బయటపెట్టేశారు సీనియర్ లీడర్ జితేందర్‌రెడ్డి. చిన్న వీడియో షేర్‌చేసి టీబీజేపీలో రచ్చ రేపారు. ఇంతకీ, జితేందర్‌రెడ్డి చేసిన ఆ ట్వీట్ ఏంటి?. రేవంత్‌రెడ్డి పేల్చిన సెటైర్లేంటో ఇప్పుడు చూద్దాం!
Jithender Reddy: తెలంగాణ బీజేపీలో కల్లోలం కొనసాగుతోంది. రోజుకో ఇష్యూ తెరపైకొచ్చి రచ్చ రేగుతోంది. రాష్ట్ర నాయకత్వంలో మార్పులంటూ చెలరేగిన చిచ్చు… సునామీలా మారుతోంది. తెలంగాణ బీజేపీలో జరుగుతోన్న అంతర్యుద్ధం ఎలాగుందో ఒకే ఒక్క ట్వీట్‌తో బయటపెట్టేశారు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి. ఆయన పెట్టిన ట్వీట్ పెద్ద కలకలమే సృష్టిస్తోంది టీబీజేపీలో. దున్నపోతును కాలితో తన్నే వీడియో ఒకటి షేర్ చేశారు జితేందర్‌రెడ్డి. ఇలాంటి ట్రీట్‌మెంటే పార్టీ నాయకత్వానికి కావాలంటూ రాసుకొచ్చారు. కాసేపటికి ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. తిరిగి మళ్లీ అదే వీడియోను పోస్ట్ చేశారు. ఆ దున్నపోతు వీడియోను అలాగే ఉంచి, మరో ట్వీట్ చేశారు.
బండి సంజయ్‌కి సపోర్ట్‌గా, కొందరు నేతల టార్గెట్‌గా పోస్ట్ పెట్టారు. జితేందర్‌రెడ్డి చేసిన ఈ ట్వీట్లు… టీబీజేపీలోనే కాదు… టోటల్ తెలంగాణ రాజకీయాల్లోనే సంచలనంగా మారాయ్. మొదటి ట్వీట్ బండి సహా నాయకత్వం మొత్తాన్నే ఉద్దేశించినట్టు ఉంటే, రెండో ట్వీట్ మాత్రం బండికి సపోర్ట్‌గా కనిపించింది. తన ట్వీట్ బండి నాయకత్వాన్ని ప్రశ్నించే వాళ్లకేనంటూ డైరెక్ట్‌గా చెప్పడం చూస్తుంటే టీబీజేపీలో విభేదాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్ధంచేసుకోవచ్చు.
బీజేపీ నేత జితేందర్‌రెడ్డి ట్వీట్స్‌పై సెటైరికల్‌గా రియాక్టయ్యారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. బీజేపీ అంతర్గత తన్నులాటలను అద్భుతమైన పోలికతో ప్రజలకు వివరించారని ట్వీట్ చేశారు. బీజేపీలో ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితి ఉందో, ఇంతకంటే గొప్పగా ఎవరూ చెప్పలేరన్నారు రేవంత్‌రెడ్డి.
వరుస పరిణామాలు చూస్తుంటే తెలంగాణ బీజేపీలో సంక్షోభం ముదిరినట్టే కనిపిస్తోంది. నాయకత్వ మార్పుపై రెండు వర్గాలుగా విడిపోయినట్టు తెలుస్తోంది. ఇలాంటి టైమ్‌లో జితేందర్‌రెడ్డి ట్వీట్స్ సంచలనం రేపుతున్నాయ్!. తెలంగాణ బీజేపీకి దున్నపోతు తరహా ట్రీట్‌మెంట్ అవసరం అంటూ ట్వీట్ చేయడం, డిలీట్ చేసి మళ్లీ అదే వీడియో షేర్ చేయడం చూస్తుంటే.. ఢీ అంటే ఢీ అన్నట్టే కనిపిస్తోంది జితేందర్‌రెడ్డి వైఖరి. మరి, ఈ రచ్చ ఇంతటితో ఆగుతుందా? లేక మరింత కల్లోలం రేగుతుందా! చూడాలి!
జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ ఇదే..
This treatment is what’s required for Bjp Telangana leadership.@blsanthosh @BJP4India @AmitShah @sunilbansalbjp @BJP4Telangana pic.twitter.com/MMeUx7fb4Q
— AP Jithender Reddy (@apjithender) June 29, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం